యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య త్వరలోనే `కస్టడీ` అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ బై లింగ్యువల్ ప్రాజెక్ట్ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. అరవింద్ స్వామి విలన్‌గా చేస్తే.. వెన్నెల కిశోర్, శరత్‌కుమార్, ప్రేమ్‌గీ అమరేన్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తుంచిన ఈ చిత్రం మే 12న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న నాగచైతన్య.. కస్టడీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చైతు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.
ఈ ఇంటర్వ్యూలో మీ సీక్రెట్ క్రష్ ఎవరంటూ ప్రశ్నించగా.. చైతూ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. `సీక్రెట్ అంటూ ఎవరూ లేదు. నాకు క్రష్ ఉన్నప్పుడు నేను బహిరంగంగా చెప్పగలను. నేను ఈ మధ్యనే బాబిలోన్ అనే హాలీవుడ్ ఫిల్మ్ చూశాను. అందులో యాక్ట్రెస్ ‘మార్గోట్ రాబీ’ నటన నాకు బాగా నచ్చింది. కాబట్టి నేను ఆమె పెర్ఫామెన్స్ పరంగా ఇష్టపడుతున్నాను. అలా ఆమె నా క్రష్` అంటూ చైతు చెప్పుకొచ్చాడు. దీంతో చైతు కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.