మొబైల్ వాడని ఏకైక స్టార్ హీరో ఇతనే..?

ప్రస్తుత కాలంలో మొబైల్ లేనిదే జీవితమే లేదు. కానీ అలాంటిది మొబైల్ లేకుండా ఒక స్టార్ హీరో ఉన్నారు. అంటే నమ్ముతారా మొబైల్ లేకుండా తమ హీరో ఉన్నారు అనే విషయం అభిమానులకు పెద్దగా తెలియకపోవచ్చు..ఆయనే తమిళ్ స్టార్ హీరో అజిత్ ఆయనకు మొబైల్ వాడటం పెద్దగా ఇష్టం ఉండదట. మరి తన సినిమాలకు సంబంధించిన విషయాలను ఎలా తెలుసుకుంటారో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Ajith Kumar Biography: Movies, Biography, News, Age & Photos

దానికి కూడా అజిత్ దగ్గర ఆప్షన్ ఉంది. అయితే ఈ విషయం బయటికి రావటానికి త్రిష ఒక కారణం.. ఇటీవల ఆమె సినిమా ప్రచారంలో భాగంగా ఇంటర్వ్యూ కు హాజరు కావడం జరిగింది. అందులో అజిత్ విషయం గురించి ఈ విషయాన్ని తెలియజేసింది.. అజిత్ నెంబర్ మీ ఫోన్లో ఏమని ఫీడ్ చేసుకున్నారు. అనే ప్రశ్న..అడగ్గా అసలు అజిత్ కి మొబైల్ ఉంటే కదా నాకు నెంబర్ ఇవ్వడానికి అని త్రిష చెప్పింది. దీంతో అజిత్ మొబైలే వాడరని అర్థమవుతోంది.మొబైల్ లేకుండా సినిమాల గురించి ఎలా తెలుసుకుంటున్నారనే విషయానికి వస్తే ఆయన సన్నిహితులను సినిమాలకు సంబంధించిన విషయాలు తన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తన మేనేజర్ ద్వారానే తెలుసుకుంటారట. అంతేకాకుండా మరో విషయం కూడా బయటపడింది.

ఏదైనా సినిమా ప్రారంభానికి ముందు ఆ నిర్మాత సంస్థ నుండి అజిత్ ఓ సిమ్ కార్డును తీసుకుంటాడట. ఆ సిమ్ కార్డును సెల్ఫోన్లో వేసి తన మేనేజర్ కి ఇస్తాడట. ఆ సినిమా అయిపోయేంత వరకు వారితో కాంటాక్ట్ లో ఉండి సినిమా అయిపోయిన తర్వాత సిమ్ తీసేస్తారనీ సమాచారం..ఏది ఏదేమైనా ఈ కాలంలో కూడా మొబైల్ వాడని హీరో ఉన్నాడంటే ఆశ్చర్య పోవాల్సిందే..

Share post:

Latest