`ఏజెంట్‌` చేసిన గాయం.. అంద‌రికీ దూరంగా వెళ్లిపోతున్న అఖిల్‌!

అక్కినేని అఖిల్ ఎన్నో ఆశ‌లు పెట్టుకుని చేసిన తాజా చిత్రం `ఐజెంట్‌`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాతో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా ప‌రిచ‌యం అయింది.

భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 28న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం అఖిల్ ఎంత‌గానో శ్ర‌మించాడు. కానీ, ఆయ‌న క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం ల‌భించ‌లేదు. ఏజెంట్ చేసిన గాయానికి అఖిల్ ఎంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే అంద‌రికీ దూరంగా వెళ్లిపోతున్నాడు.

సాధార‌ణంగా హీరోలు సినిమా ఫ్లాప్ అయితే ఆ మూడ్‌ నుంచి బయటకు రావడానికి ఏదో ఒక చోటుకి వెకేషన్ కోసం వెళ్ళిపోతారు. ఇప్పుడు అఖిల్ కూడా అదే చేశాడు. ఏజెంట్ ఫ‌లితం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం అఖిల్ సింగిల్ గా దుబాయ్ ట్రిప్ కు వెళ్ళిపోతున్నాడు. తాజాగా ఎయిర్ పోర్ట్ లో అఖిల్ కి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. కొద్ది రోజులు దుబాయ్ లోనే రిలాక్స్ అయ్యి మరల వచ్చి త‌దుప‌రి ప్రాజెక్ట్ పై ఫోక‌స్ పెట్టాల‌ని అఖిల్ ఫిక్స్ అయ్యాడ‌ట‌.