మంచు మనోజ్ ఇంత మంచోడా.. అనాథల కోసం ఏకంగా..

టాలీవుడ్‌ సీనియర్ హీరో మంచు మోహన్ బాబుకి చిన్న కొడుకైన మంచు విష్ణు గురించి స్పెషల్‌గా పరిచయం అవసరం లేదు. ఈ మంచు వారి అబ్బాయి చాలా ఏళ్ల క్రితమే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజు భాయ్, బిందాస్, వేదం, పోటుగాడు వంటి సినిమాలతో బాగా అలరించాడు. అయితే ఈ మధ్య మాత్రం మనోజ్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గా ఉంటాడు. ఇటీవలే భూమా మౌనిక రెడ్డి వివాహం చేసుకున్న తరువాత సోషల్ మీడియాలో మనోజ్ పేరు మారుమ్రోగిపోతుంది.

 

కాగా తాజాగా మనోజ్ పుట్టినరోజు సందర్బంగా అతని మంచి మనసుని చాటుకున్నాడు. తన పుట్టినరోజు వేడుకను ఏ పబ్ లోనో రెస్టారెంట్ లోనో జరుపుకోకుండా అనాథ పిల్లలతో జరుపుకున్నాడు. హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్, గాజుల రామారంలోని కేర్ అండ్ లవ్ అనే అనాథ ఆశ్రమంలోని పిల్లల వద్దకు వెళ్లి మనోజ్ తన పుట్టినరోజు వేడుకను ఎంతో ఆనందంగా జరుపుకున్నాడు. చిన్నారులతో కలిసి కొద్దిసేపు ముచ్చటించిన తరువాత వారికి నోట్‌బుక్స్, బొమ్మలు, బ్యాగ్స్, స్వీట్స్ అందించారు.

మనోజ్ తన పుట్టినరోజుని చిన్నారులతో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ ‘పిల్లలు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. నేను కూడా భవిష్యత్తులో వారికి ఇంకెక్కువ సేవలు చేస్తాను. వారికి మనం తోడుగా ఉంటే ఎప్పుడు ఆనందంగా ఉంటారు. వారి సంతోషం చూస్తుంటే నాక్కూడా చాలా ఆనందంగా ఉంది.’ అని చెప్పారు. ప్రస్తుతం దీని సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోస్ చూసి చాలామంది మనోజ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Share post:

Latest