13 ఏళ్ల‌కే త‌మ‌న్నా అలాంటి ప‌ని చేసిందా.. మిల్కీ బ్యూటీ మామూల్ది కాదు!

సుదీర్ఘకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో యంగ్ హీరోయిన్లకు గ‌ట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం తమన్నా లిస్టులో భోళా శంకర్‌, జైలర్ వంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లో తమన్నా ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది.

ఈ సంగతి పక్కన పెడితే తమన్నా 2005లోనే సినీ గ‌డ‌ప తొక్కిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. `చాంద్ సా రోషన్ చెహ్రా` అనే హిందీ సినిమాలో ఆమె మొట్ట మొద‌టిసారి న‌టించింది. అయితే ఈ సినిమాలో న‌టించే స‌మ‌యానికి త‌మ‌న్నా వ‌య‌సు ఎంతో తెలుసా..? కేవ‌లం 13 ఏళ్లు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. 13 ఏళ్ల‌కే త‌మన్నా న‌ట‌న వైపు అడుగులు వేసింది.

`చాంద్‌ సా రోషన్‌ చెహ్రా` సినిమా త‌ర్వాత త‌మ‌న్నాకు మ‌రిన్ని అవ‌కాశాలు త‌లుపు త‌ట్టాయి. దాంతో యాక్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొని ముంబైలోని పృథ్వీ థియేటర్‌లో ఏడాదిపాటు యాక్టింగ్ నేర్చుకుంద‌ట‌. అతి చిన్న వ‌య‌సులోనే సినిమా అవకాశాలు పెరిగిపోవడంతో డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తిచేసింద‌ట‌. ఇక చాలా మంది మోడలింగ్‌లో అనుభవం వచ్చాక సినిమాల్లో ట్రై చేస్తారు. కానీ.. త‌మ‌న్నా విష‌యంలో మాత్రం ఇది ఉల్టా జరిగింది. ముందు సినిమాలో నటించి.. ఆ తర్వాత మోడలింగ్ చేసింది. ఇక త‌మ‌న్నా తెలుగులో న‌టించిన తొలి చిత్రం `శ్రీ‌` కాగా.. ఆమెకు మాత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన `హ్యాపీ డేస్`తో బ్రేక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హోదాను అందుకుంది.

Share post:

Latest