సౌందర్య పై తల్లి షాకింగ్ కామెంట్స్..!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ సౌందర్య గురించి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. అప్పటి అందరి హీరోల సరసన నటించి ప్రేక్షకులలో చెరగని ముద్రను వేసుకుంది. ఇప్పటికీ కూడా సౌందర్య లాగా ఎవరూ నటించ లెరంటు చాలా మంది అంటుంటారు. సౌందర్య 31 ఏళ్లకే ఇండస్ట్రీకి దూరమైపోయింది. 100కు పైగానే సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. అయితే సౌందర్య తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ,మలయాళం భాషలలో నటించి అభిమానులందరినీ దగ్గర చేసుకుంది.

Soundarya Profile Biogarphy Biodata Family Photos

మొట్టమొదటిగా మనవరాలి పెళ్లితో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఆ తరువాత అమ్మోరు సినిమాలో అమాయకమైన ఫేస్ తో నటించింది.ఆ తరువాత పెదరాయుడు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సౌందర్య రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే సౌందర్య ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది.

అయితే ఆమె ఎలా మరణించిందో తెలిసిందే ..ఆ మరణం తరువాత ఆమె తల్లి డిప్రెషన్ లోకి వెళ్లారు సౌందర్య తో పాటు ఆమె సోదరుడు కూడా మరణించడంతో చాలా కాలం పాటు మీడియా ముందుకు రావడానికి కూడా ఆమె ఒప్పుకోలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సౌందర్య తల్లి మాట్లాడుతూ… చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. తనకి సౌందర్య ప్రతిరోజు కలలోకి వస్తుందని అమ్మ నువ్వు బాధపడకు నీకు నేనున్నానని అంటుందట సౌందర్య కానీ ఆకల మధ్యలోనే ఆగిపోతుందని అలా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదని సౌందర్య తల్లి ఎమోషనల్ అవుతూ తెలిపారు. ఏదేమైనా సౌందర్య చనిపోయి తెలుగు ఇండస్ట్రీ ఒక మంచి నటిని కోల్పోయిందని ఎంతోమంది ఇప్పటికి తెలియజేస్తూ ఉంటారు..

Share post:

Latest