దుమ్ము దుమారం రేపుతున్న `బిచ్చ‌గాడు 2`.. రెండు రోజుల్లో స‌గం టార్గెట్ అవుట్‌!

2016లో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిన `బిచ్చ‌గాడు` మూవీకి తాజాగా `బిచ్చగాడు 2` టైటిల్ తో సీక్వెల్ విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో విజ‌య్ ఆంటోనీ, కావ్య థాప‌ర్ జంట‌గా న‌టించారు. హరీష్ పేరడి, దేవ్ గిల్, యోగిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

అలాగే విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. మే 19న తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము దుమారం రేపుతోంది. తెలుగులో రూ. 6.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. రెండు రోజుల్లోనే రూ. 3.95 కోట్లు రాబ‌ట్టి స‌గం టార్గెట్ ను రీచ్ అయింది.

ఫ‌స్ట్ డేనే రూ. 2.32 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా.. రెండో రోజు ఎన్టీఆర్ `సింహాద్రి` పోటీగా ఉన్నా స‌రే రూ. 1.62 కోట్లు వ‌సూల్ చేసింది. రూ.2.55 కోట్లు రాబ‌డితే.. తెలుగులో ఈ సినిమా క్లీన్ హిట్ అవుతుంది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 16 కోట్ల టార్గెట్ తో వ‌చ్చిన బిచ్చ‌గాడు 2.. రూ. 7 కోట్ల షేర్, రూ.14.30 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

Share post:

Latest