కృష్ణ అట్ట‌ర్‌ప్లాప్ అవుతుంద‌ని చెప్పినా.. మ‌హేష్ మొండిగా చేసిన బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా ఇదే…!

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మహేష్ బాబు. రాజకుమారుడు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత చాలా తెలుగు సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా మారాడు. మహేష్ కి టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు కలలు రాకుమారుడు గా మహేష్ బాబు ముద్ర‌వేసుకున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం వ‌రుస‌ హిట్స్ తో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. మహేష్ బాబు ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో ఏదైనా కథను ఎంచుకునే ముందు తండ్రి కృష్ణ సలహా కూడా తీసుకునే వాడట. అయితే ఒక్క సినిమాలో మాత్రం కృష్ణ కథ విన్న తర్వాత ఆ సినిమా నువ్వు చేయవద్దు కథ‌ అంతగా బాగోలేదని చెప్పేసార‌ట‌. కృష్ణ వ‌ద్ద‌ని చెప్పినా కూడా మహేష్ బాబు మాత్రం వినకుండా మొండిగా ఆ సినిమాలో న‌టించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఇంతకీ ఏంటా సినిమా..? ఏంటో చూస్తే ఆశ్చ‌ర్య‌పోతాం.

Mahesh Babu posts heartfelt note days after dad Krishna's demise. Says, 'I  will carry your legacy forward' - India Today

సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మురారి. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కృష్ణ‌కు గ‌తంలో ప‌ర్మినెంట్ సినిమాల నిర్మాత అయిన నందిగం రామ‌లింగేశ్వ‌ర‌రావు ఈ సినిమాను నిర్మించారు. 2001లో విడుదలైన ఈ సినిమాకి మొదట్లో ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది.

Murari | Watch Full HD Telugu Movie Murari 2001 Online

ఈ సినిమా చూసిన తర్వాత కృష్ణ మహేష్ బాబును ప్రశంసలతో ముంచేశాడట. కాగా ప్రస్తుతం మహేష్ బాబు పూజ హెగ్డే హీరోయిన్ గా తన 28వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ కాగా… శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తుంది.

Share post:

Latest