అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం `కస్టడీ`. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్వకత్వం వహిస్తే.. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు. ప్రియమణి, అరవింద్ స్వామి, శరత్ కుమార్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు.
మే 12న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అక్కినేని అభిమానులను కూడా ఈ సినిమా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. రూ. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో తొలి రెండు రోజుల్లో రూ. 2.62 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.
మూడు రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 78 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకున్న కస్టడీ.. వరల్డ్ వైడ్ గా రూ. 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది. ఇక రూ. 25 కోట్ల టార్గెట్ కు మూడు రోజుల్లో వచ్చింది రూ. 4.83 కోట్లు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా రూ. 20.17 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంది. ఇక ఏరియాల వారీగా కస్టడీ 2 డేస్ టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నిజాం: 1.27 కోట్లు
సీడెడ్: 41 లక్షలు
ఉత్తరాంధ్ర: 41 లక్షలు
తూర్పు: 27 లక్షలు
పశ్చిమ: 20 లక్షలు
గుంటూరు: 36 లక్షలు
కృష్ణ: 29 లక్షలు
నెల్లూరు: 19 లక్షలు
—————————————
ఏపీ+తెలంగాణ= 3.40 కోట్లు(6.25 కోట్లు~ గ్రాస్)
—————————————
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 20 లక్షలు
ఓవర్సీస్: 1.00 కోట్లు
తమిళం: 23 లక్షలు
——————————————-
టోటల్ వరల్డ్ వైడ్= 4.83 కోట్లు(10.20 కోట్లు~ గ్రాస్)
——————————————-