ర‌జ‌నీపై వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన జ‌గ్గూభాయ్‌..!

కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన రజినీకాంత్ విజయవాడలో ఈ సభ చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ తదితరులు సైతం హాజరయ్యారు. అయితే రజనీ కాంత్ నందమూరి కుటుంబంతో చాలా కాలం నుంచి మంచి సంబంధాలు ఉండడంతో ఈ క్రమంలోని ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొని తారక రామారావు, చంద్రబాబు ,బాలకృష్ణ పై పొగడ్తల వర్షం కురిపించారు.

Jagapathi Babu roped in for Rajinikanth's 'Annaatthe' | The News Minute
దీంతో వైసిపి నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బాలయ్య చంద్రబాబు నాయుడులను పొగడడంపై కొంతమంది వైసీపీ నేతలు రజనీకాంత్ పైన దారుణంగా విమర్శలు చేశారు.. దీంతో కొన్ని సందర్భాలలో ఆయన స్థాయిని తగ్గించి మరి కామెంట్లు చేస్తూ ఉన్నారు. దీంతో రజినీకాంత్ అభిమానులు వైసిపి నాయకులు పైన పలు కామెంట్లు చేయడం జరుగుతోంది. కేవలం నందమూరి కుటుంబంతో తనకున్న స్నేహం కారణంగానే ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు రజనీకాంత్.

దీంతో రజినీకాంత్ ఫ్యాన్స్ వైసీపీ నాయకులు మధ్య పెద్ద వార్ జరుగుతోంది .అయితే ఈ వివాదంపై జగపతిబాబు స్పందించారు. ఈ వివాదంపై టాలీవుడ్ నటుడు జగపతిబాబు స్పందిస్తూ.. ప్రస్తుతం ఆయన నటించిన రామబాణం ప్రమోషన్స్ లో పాల్గొన్న జగపతిబాబు.. ఈ విషయంపై మాట్లాడుతూ నేను ఎక్కువగా టీవీలు చూడను పత్రికలు చదవను దీంతో ఆయన ఏం మాట్లాడారో ..ఎవరిని విమర్శించారో ..అనేది నాకు పెద్దగా అవగాహన లేదు.. కానీ రజనీకాంత్ నవ్విస్తూ చక్కగా నిజాలు మాట్లాడతాడు తనని అనే వాళ్ళు ఎప్పుడూ ఉండనే ఉంటారని తెలిపారు. గతంలో రజనీకాంత్ జగపతిబాబు రెండు సినిమాలలో నటించారు అందులో ఒకటి లింగ మరొకటి కథానాయకుడు.

Share post:

Latest