శ‌ర‌త్ బాబు మృతిపై సంతాపం తెలిపిన క‌మ‌ల్ హాస‌న్.. అంత‌లోనే బిగ్ షాక్‌!

సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు గ‌త కొద్ది రోజుల నుంచి ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో హాస్ప‌ట‌ల్ లో చేరిన‌ సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌ లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా శర‌త్ బాబు మృతి చెందారంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. పలు ప్రముఖ వైబ్ సైట్లు సైతం శరత్ బాబు ఇక లేరంటూ వార్తలు ప్రచురించాయి.

దాంతో కొంద‌రు సినీ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా ద్వారా శ‌ర‌త్ బాబు మృతిపై సంతాపం తెలిపారు. ఈ లిస్ట్ లో లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కూడా ఒక‌రు. శ‌ర‌త్ బాబు నివాళుల అర్పిస్తూ ఓ ట్వీట్ చేశారు. `ప్రియ‌మైన బిగ్ బ్ర‌ద‌ర్ శ‌ర‌త్ బాబు నాకు మంచి స్నేహితుడు. మంచి మ‌న‌సున్న వ్య‌క్తి. ఆయ‌నను కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం` అని క‌మ‌ల్ హాస‌న్ ట్వీట్ వ‌దిలారు.

అయితే అంతలోనే ఆయ‌న‌కు బిగ్ షాక్ త‌గిలింది. శ‌ర‌త్ బాబు హెల్త్ పై ఆయన సోదరి రియాక్ట్ అయింది. ఆయ‌న మ‌ర‌ణించార‌ని వ‌స్తున్న‌ వార్తల్లో నిజం లేదని.. శరత్ బాబు ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతోందని తాజాగా మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. దాంతో త‌ప్పులో క‌లేశాన‌ని గుర్తించిన క‌మ‌ల్ హాస‌న్ వెంట‌నే త‌న ట్వీట్ ను డిలీడ్ చేశారు. కానీ, అప్ప‌టికే కొంద‌రు క‌మ‌ల్ ట్వీట్ ను స్క్రీన్ షాట్ చేసి వైర‌ల్ చేసేశారు.

Share post:

Latest