శ్రీ లీల జోరు మామూలుగా లేదుగా.. టాలీవుడ్‌లో ఆమే ప్రస్తుతం నంబర్.1

టాలీవుడ్‌లో రొమాంటిక్ మ్యూజికల్ చిత్రం ‘పెళ్లి సందడి’తో శ్రీలీల అడుగు పెట్టింది. అనతి కాలంలోనే సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అమెరికాలో జన్మించిన ఈ తెలుగు అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ డిమాండ్ ఉన్న నటి. ఆమె ఖాతాలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి సరసన సినీ అవకాశాలను ఆమె దక్కించుకుంది. ఇవే కాకుండా మరిన్ని సినిమాలు ఆమె ఖాతాలో రానున్నాయి. ముఖ్యంగా శ్రీలీల పట్ల యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు మక్కువ చూపుతున్నారు. రవితేజతో ‘ధమాకా’ చిత్రంలో ఆమె ఆడిపాడింది. తనకు సీనియర్ హీరోలు, యంగ్ హీరోలు అనే తేడా లేదంటూ ఆమె చెప్పకనే చెప్పింది.

ఇటీవల కొన్ని ఇంటర్వ్యూలలో తన రాబోయే చిత్రాల గురించి శ్రీలీల వెల్లడించింది. తాను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడిల సినిమా షూటింగ్‌లో ఉన్నానని తెలిపింది. త్వరలో రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో జాయిన్ అవుతానని వివరించింది. ఆమె చాలా కాలంగా పంజా వైష్ణవ్ తేజ సినిమా షూటింగ్ లో ఉంది. దీంతో పాటు నితిన్ సరసన కూడా ఆమె నటించనుంది. ఆ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇదే కాకుండా మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలోనూ ఆమె నటించనుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల నంబర్ 1 అని అంతా అనుకుంటున్నారు. మరో ఇతర హీరోయిన్ ఆమె దరిదాపుల్లో లేకపోవడమే దీనికి కారణం.

వరుసగా ఇన్ని సినీ అవకాశాలు ప్రస్తుతం ఏ హీరోయిన్‌కు లేవు. పైగా ఆదివారం కూడా షూటింగ్స్ కు శ్రీలీల ఒప్పుకుంటోంది. మరికొన్ని సమయాల్లో రాత్రి కూడా షూటింగ్ చేసేందుకు కాల్షీట్లు ఇస్తోంది. దీంతో పలువురు హీరోలు ఆమె డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఫలితంగా అతి తక్కువ సమయంలోనే ఆమె ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్‌గా పేరొందింది.

Share post:

Latest