టీడీపీ-జనసేనకు జగన్ చెక్..వైసీపీ గెలుపే టార్గెట్.!

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవడమే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. మరొకసారి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నారు. ఇక ఇటు జగన్ కు చెక్ పెట్టి అధికారంలోకి రావాలని టి‌డి‌పి అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే పవన్‌ని కలుపుకుని జగన్ కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. పవన్ సైతం బాబుతో కలవడానికి రెడీగా ఉన్నారు. ఇక ఈ ఇద్దరు కలిస్తే వైసీపీకి కాస్త ట్రబుల్ తప్పదు.

అయితే అవేమీ లేకుండా టి‌డి‌పి-జనసేన కలిసొచ్చినా..ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టి అధికారం సొంతం చేసుకోవాలనేది జగన్ టార్గెట్. కానీ దాదాపు టి‌డి‌పి-జనసేన పొత్తు చెడగొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకే రెండు పార్టీల మధ్య ఏదొక గొడవ వచ్చేలా చేస్తున్నారు. అలా కుదరని పక్షంలో రెండు పార్టీలు కలుస్తున్నాయి…తాను ఒంటరిగా పోరాడుతున్నానని ఇప్పటికే ప్రజల్లో సెంటిమెంట్ లేపే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల లబ్దిదారులని జగన్ టార్గెట్ చేసుకున్నారు. వారు ఓటు వేస్తే తమకు తిరుగుండదని అనుకుంటున్నారు.

ఇప్పటికే పథకాల ద్వారా ఏ కుటుంబానికి ఎంతెంత వచ్చిందనే లెక్కలు వేసుకుని ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్ళి చెబుతున్నారు. ఇక వారి చేత మా నమ్మకం నువ్వే జగన్..అంటూ ప్రభుత్వానికి మిస్సడ్ కాల్స్ ఇప్పిస్తున్నారు. అయితే దాదాపు కోటి 20 లక్షల కుటుంబాలు మిస్సడ్ కాల్స్ ఇచ్చాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంటే ఇంకా తమకు తిరుగులేదని భావిస్తున్నారు.

అంటే టి‌డి‌పి-జనసేన కలిసిన..వారు అధికారంలోకి వస్తే ఇప్పుడు వచ్చే పథకాలు రావని ప్రచారం కూడా చేస్తున్నారు. ఇక జగన్ వస్తేనే పథకాలు అన్నట్లు అంటున్నారు. ఇలా టోటల్ గా ప్రభుత్వ పథకాలు వచ్చేవారినే జగన్ టార్గెట్ చేసుకున్నారు. మరి వారు ఎంతవరకు జగన్ కు మద్ధతు ఇస్తారో చూడాలి.

Share post:

Latest