నవ్య స్వామి తో రిలేషన్షిప్ పై మొదటి సారి క్లారిటీ ఇచ్చిన రవికృష్ణ..!!

తెలుగు బుల్లితెరపై నటుడు రవికృష్ణ నటి నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ పలు సీరియల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. సోషల్ మీడియాలో కూడా ఈ జంటకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇద్దరు కలిసి పలు సీరియల్స్ లో నటించడం వల్ల వీరిది హిట్ పెయిర్ గా పేరుపొందింది. ఇక నవ్య స్వామి ,రవికృష్ణ ఇద్దరు కూడా వేరు వేరు సీజన్లో బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనడం ఈ షో వల్ల మరింత పాపులారిటీ సంపాదించారు.

Exclusive - Aame Katha actress Navya Swamy refutes link-up rumours with  co-star Ravikrishna; says, 'My family is disturbed' - Times of India
బిగ్ బాస్ తర్వాత వీరిద్దరి మీద ఎక్కువగా ప్రేక్షకులు ఫోకస్ పెట్టారు. టీవీ షోలో కూడా వీరిద్దరూ కలిసి వచ్చేలా పలు టీవీ షోలు ప్లాన్ చేసేవారన్నట్లుగా తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని డేటింగ్ లో ఉన్నారని వార్తలు ఎక్కువగా వినిపించాయి. గతంలో కూడా ఈ వార్తలపై నవ్య స్వామి, రవికృష్ణ స్పందించడం జరిగింది. రవికృష్ణ ఈ విషయంపై స్పందిస్తూ.. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అని ఇక మేము బయట కూడా కలిసి తిరగడం వీడియోలు, ఫోటోలు వంటివి తీయడం వల్ల ఈ జంట ప్రేమలో ఉందని అంతా అనుకుంటూ ఉంటారని తెలిపారు.

ఇటీవల రవికృష్ణ విరూపాక్ష సినిమాలో కూడా నటించి మెప్పించారు. ప్రస్తుతం రవికృష్ణ సీరియల్స్ చేయట్లేదట. తను లాస్ట్ సీరియల్ నవ్య స్వామి తోనే చేశాను ఆ తర్వాత మళ్లీ ఇంకేం సీరియల్ చేయలేదు.. మా మీద వచ్చే వార్తలు ఇద్దరము చూస్తాము చూసి వదిలేస్తాము మాకు అయితే పెళ్లి మీద ఆలోచన లేదు.. కేవలం మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ తెలిపారు.. ఒకవేళ నవ్య స్వామి ప్రపోజ్ చేస్తే.. ఆ విషయంపై ఆలోచిస్తానని తెలిపారు రవికృష్ణ. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Share post:

Latest