పెళ్లి పీట‌లెక్క‌బోతున్న మెహ్రీన్ మాజీ ప్రియుడు.. అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకే!

యంగ్ హీరోయిన్ మెహ్రీన్ మాజీ ప్రియుడు, హరియాణా మాజీ సీఎం భజన్ లాల్ భిష్ణోయ్ మనవడు భవ్య భిష్ణోయ్ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. భ‌వ్య భిష్ణోయ్‌, మెహ్రీన్ గ‌తంలో డీప్ గా ల‌వ్ చేసుకున్నారు. వీరి ప్రేమ‌ను పెద్ద‌లు అంగీక‌రించ‌డంతో.. మెహ్రీన్‌, భ‌వ్య భిష్ణోయ్ ఘ‌నంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.

 

ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ.. పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే బ్రేక‌ప్ చెప్పుకున్నారు. భవ్య భిష్ణోయ్ తో నిశ్చితార్థాన్ని ర‌ద్దు చేసుకున్న‌ట్లు మెహ్రీన్ రెండేళ్ల క్రితం అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేసింది. ఆ త‌ర్వాత మెహ్రీన్ కెరీర్ పై ఫోక‌స్ పెట్టింది. అలాగే భ‌వ్య భిష్ణోయ్ 2022 ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.

ఇక ఇప్పుడు ఇత‌గాడు వైవాహిక బంధంలోకి అడుగు పెట్టేందుకు రెడీ అయ్యాడు. పరి బిష్ణోయ్ అనే అమ్మాయితో తాజాగా భ‌వ్య భిష్ణోయ్ నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను భ‌వ్య భిష్ణోయ్ స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ప‌రి హర్యానాకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ కావ‌డం విశేషం. త్వరలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.