పూజా హెగ్డేనా మ‌జాకా.. వ‌రుస ఫ్లాపుల్లోనూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా!

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే ఖాతాలో సరైన హిట్ పడి ఏడాదిన్నర అవుతోంది. ముఖ్యంగా గత ఏడది ఈ అమ్మడుకు అస్సలు కలిసి రాలేదు. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్‌, ఆచార్య, బీస్ట్‌, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ ఏడాది `కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌` మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు.

అయితే ఈ చిత్రం సైతం ప్రేక్షకుల‌ను మెప్పించడంలో విఫలమైంది. వరుసగా ఐదు ఫ్లాపులు పడడంతో పూజా హెగ్డేను నెటిజ‌న్లు ఐరన్ లెగ్‌ అంటూ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక పూజా హెగ్డే కెరీర్ క్లోజ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పూజా హెగ్డే ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చింది.

బాలీవుడ్ లో ఓ స్టార్ హీరో మూవీకి సైన్ చేసి.. వ‌రుస ఫ్లాపుల్లోనూ త‌న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ట్రోల‌ర్స్ కు చెప్పుతో కొట్టిన‌ట్లు చెప్పింది. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు షాహిద్ క‌పూర్‌. రోష‌న్ ఆండ్రూస్ ద‌ర్శ‌క‌త్వంలో షాహిద్ క‌పూర్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీకి `కోయీ షాక్‌` అనే టైటిల్ ను ఖారారు చేశారు. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయింద‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు సైతం పూర్తి అయిన‌ట్లు తెలుస్తోంది. దీంతో పూజా హెగ్డేనా మజాకా అంటూ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

Share post:

Latest