కస్టడీ సినిమా ఎలా వుందంటే..?

అక్కినేని హీరో నాగచైతన్య మొదట జోష్ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ఈ సినిమా సరిగ్గా ఆడక పోవడంతో ఏ మాయ చేసావే సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడడం జరిగింది. అప్పటినుంచి నాగచైతన్య చేస్తున్న సినిమాలన్నీ వరుసగా మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా నాగచైతన్య, కృతి శెట్టి కలిసి నటించిన చిత్రం కస్టడీ ఈనెల 12వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు.

Naga Chaitanya's Custody Trailer Will Be Out Tomorrow

అలాగే కీలకమైన పాత్రలో ప్రియమణి ,అరవిందస్వామి, శరత్ కుమార్, సంపత్ రాజ్ నటిస్తూ ఉన్నారు. నాగచైతన్య కెరియర్ లోని కస్టడీ సినిమా బెస్ట్ మూవీగా అవుతుందని చాలా ధీమాగా ఉన్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్ ట్రైలర్ ఈ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేశారు. మేకర్స్ ఈ సినిమా అని ప్రమోషన్ చేస్తూ మరింత బజ్జను క్రియేట్ చేస్తున్నారు. బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Custody Telugu Movie Trailer Talk: Action Packed Tale

తాజాగా కస్టడీ మూవీ ని ప్రసాద్ ల్యాబ్లో కొంతమంది సినీ ప్రముఖుల మధ్య ప్రదర్శించడం జరిగింది.. ఈ సినిమా చూసిన వారంతా పాజిటివ్ గానే స్పందించినట్లు తెలుస్తోంది. సినిమాలో మొదట 20 నిమిషాలు చాలా కూల్ గా ఉన్నప్పటికీ ఆ తర్వాత నుంచి సినిమా హైలైట్ గా మారుతుందని ఆరంభం నుంచి ప్రేక్షకుడి ఈ సినిమాలో లీనమైపోయి చూస్తూ ఉంటారని తెలుస్తోంది. ముఖ్యంగా అరవింద స్వామి ఎంట్రీ తో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందట. నాగచైతన్య కూడా తన పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా కథంతా కృతి శెట్టి తిరుగుతూ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా ఇంటర్వెల్ ముందు చివరి 15 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం. కచ్చితంగా నాగచైతన్య ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలుస్తుందని ప్రివ్యూ చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు.

Share post:

Latest