గుంటూరులో వైసీపీకి కన్ఫ్యూజన్..వారికి స్వీప్ ఛాన్స్.!

నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి భారీ దెబ్బ ఎక్కడైనా తగిలేది ఉందంటే..అది గుంటూరు జిల్లాలోనే అని చెప్పాలి. రాజధాని అమరావతిని దెబ్బతీసిన వైసీపీపై అక్కడి ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో ఉన్నారు. గత ఎన్నికల్లో కొత్తగా ఏర్పడిన గుంటూరు జిల్లాలో 7 సీట్లు ఉంటే..అందులో 6 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. ఆఖరికి రాజధాని ఏర్పాటు చేసిన టి‌డి‌పికి ఒక సీటు వచ్చింది. రాజధాని ప్రాంతంలో ఉన్న సీట్లలో కూడా వైసీపీ గెల్చింది.

కొత్త గుంటూరు జిల్లాలో 7 సీట్లు ఉన్నాయి. గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు సీట్లు ఉన్నాయి. ఇందులో గుంటూరు వెస్ట్ మినహా మిగిలిన సీట్లు వైసీపీ గెలుచుకుంది. కానీ ఇప్పుడు అన్నీ సీట్లలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఎలాగో రాజధాని ప్రాంతంలో ఉన్న మంగళగిరిలో వైసీపీకి యాంటీ ఎక్కువగా ఉంది. అక్కడ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి మళ్ళీ సీటు ఇస్తారో లేదో తెలియదు. అటు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ రెండు సీట్లలో ఎవరిని నిలబెట్టిన వైసీపీకి కలిసోచ్చేలా లేదు..టి‌డిపికే ప్లస్ ఉంది. ఇప్పుడు అక్కడ కొత్తగా బయటవాళ్ళకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన సరే వైసీపీకి ఉపయోగం లేదు. ఇక పొన్నూరు టి‌డి‌పికి వన్ సైడ్. తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్, ఈస్ట్ స్థానాల్లో టి‌డి‌పికి ప్లస్ ఉంది..అదే సమయంలో జనసేనతో కలిస్తే ఈ నాలుగు స్థానాల్లో వైసీపీకి చెక్ పడుతుంది. అంటే టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే గుంటూరులో స్వీప్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తానికి గుంటూరులో వైసీపీకి భారీ డ్యామేజ్ తప్పదు.