అది నా దురదృష్టం.. సామ్ తో విడిపోవ‌డంపై చైతు హార్ట్ టచింగ్ కామెంట్స్‌!

యువ సామ్రాట్‌ అక్కినేని నాగచైతన్య 2017లో ప్రముఖ హీరోయిన్ సమంతతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. నాలుగేళ్లు గ‌డవకముందే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు.

 

అటు సమంత ఇటు చైతు కెరీర్ పరంగా బిజీ అయ్యారు. ప్రస్తుతం నాగచైతన్య `కస్టడీ` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. మే 12న‌ ఈ మూవీ విడుదల కాబోతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతు.. సామ్‌ తో విడిపోవడం పై హార్ట్ టచింగ్ కామెంట్స్ చేశాడు. `నా వ్యక్తిగత జీవితంలో ఏదైతో జరిగిందే అది నా దురదృష్టం. అదంతా నా వ్య‌క్తిగ‌తం. నా సినిమాల గురించి ఎవరెంత మాట్లాడుకున్నా నేను పెద్దగా పట్టించుకోను.

కానీ ఫ్యామిలీ విషయానికొస్తే మాత్రం చాలా హర్ట్‌ అవుతాను. నా గురించి మాట్లాడినా వ‌దిలేస్తా.. అలా కాకుండా నా ఫ్యామిలీకి లింక్‌ చేయడం, మూడో వ్యక్తిని తెచ్చి నా పర్సనల్‌ లైఫ్‌లో ఇన్వాల్వ్‌ చేయడం క‌రెక్ట్ కాదు. అది చాలా పెద్ద తప్పు.` అంటూ చైతు వ్యాఖ్యానించాడు. ఇక స‌మంత గురించి మాట్లాడుతూ.. ఆమె హార్డ్ వ‌ర్క్ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని, ఆమెకు సినిమాల పట్ల ఎంత‌ నిబద్ధత ఉంద‌ని పేర్కొన్నాడు. అలాగే సామ్‌ నటించిన ది ఫ్యామిలీ మెన్‌, ఓ బేబీ సినిమాలంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని పేర్కొన్నాడు.

Share post:

Latest