విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!!

టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా పేరు పొందిన విజయ్ దేవరకొండ కెరియర్ మొదలుపెట్టి ఇప్పటికి ఏడు సంవత్సరాలు పైనే కావస్తోంది. విజయ్ దేవరకొండ సినిమా సక్సెస్ అయి ఇప్పటికి మూడు సంవత్సరాలు పైనే అవుతుంది మొదట పెళ్లిచూపులు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ కి స్టార్ గా మారిపోయారు.. ఆ తర్వాత గీత గోవిందం,టాక్సీవాలా వంటి చిత్రాలలో నటించారు.

Vijay Deverakonda turns Co-owner of the Hyderabad BlackHawks volleyball  team | Regional News | Zee News
విజయ్ దేవరకొండ కెరియర్లో దాదాపుగా పది సినిమాలకు నో చెప్పారు. ఇందులో కొన్ని సినిమాలు నచ్చక చేయక మరికొన్ని సినిమాలు డేట్ అడ్జస్ట్ కాక వదిలేసినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాని హిందీలో తెరకెక్కించాలనుకోగా ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నితిన్ కెరియర్ లో బెస్ట్ మూవీ గా నిలిచిన చిత్రం భీష్మ.. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా వాస్తవానికి ముందు విజయ్ దేవరకొండ చేయవలసి ఉండగా ఎందుకో ఈ సినిమా కథ విజయ్ కి నచ్చలేదట.

Vijay Devarakonda reveals his favorite actors
ఆ తర్వాత మరొక చిత్రం బాలీవుడ్లో అర్జున్ రెడ్డి సినిమా అని రీమేక్ చేయాలని భావించగా ఈ సినిమాలో కూడా నటించలేదట విజయ్ దేవరకొండ. లైగర్ సినిమా కంటే ముందు విజయ్ దేవరకొండ తో పూరి జగన్నాథ్ ఒక సినిమా చేయాల్సి ఉండగా మొహమాటం లేకుండా రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన అవకాశాన్ని కూడా నో చెప్పినట్లు తెలుస్తోంది. మరొక చిత్రం RX -100 ఈ చిత్రంలో ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. సినిమా ఉప్పెన.. ఈ సినిమా స్టోరీ బుచ్చిబాబు చెప్పినప్పుడు విజయ్ చెప్పారట.కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఇమేజ్ భారీగా పెరిగిపోవడంతో ఈ కథను ఊహించుకోలేకపోయారట బుచ్చిబాబు. దీంతో విజయ్ కూడా ఈ సినిమాకి నో చెప్పారట. తమిళంలో హీరో అనే చిత్రాన్ని మొదలుపెట్టి ఆపేసినట్లు తెలుస్తోంది.

Share post:

Latest