లోకేష్ స్కెచ్..వైసీపీకి టెన్షన్..సీట్ల కోసం తిప్పలు.!

లోకేష్ పాదయాత్రతో వైసీపీ టెన్షన్ పడుతుందా? లోకేష్ ఎక్కడకక్కడ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తూ భూ కబ్జా ఆరోపణలు అంశంలో వైసీపీకి ఇబ్బందిగా మారిందా? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని చూస్తే అదే నిజమనిస్తుంది. పాదయాత్రతో లోకేష్ దూసుకెళుతున్నారు. ఓ వైపు ప్రజా మద్ధతు పెంచుకుంటూనే..మరోవైపు వైసీపీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇక లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తే..అక్కడ స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తున్నారు. భూ కబ్జాలు చేస్తున్నారని, ఇసుక దోచేస్తున్నారని, అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని ఆధారాలతో సహ వారిపై ఆరోపణలు చేస్తున్నారు. ఆ మధ్య ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డిపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చివరికి కేతిరెడ్డి స్పందించి కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్తితి. దీంతో అప్పటివరకు కేతిరెడ్డికి ఉన్న కాస్త మంచి పేరు పోయే పరిస్తితి వచ్చింది.

అలా ఎక్కడకక్కడ వైసీపీ ఎమ్మెల్యేలని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కర్నూలులో పాదయాత్ర చేస్తున్న లోకేష్..అక్కడ ఎమ్మెల్యేలని వదలడం లేదు.  తాజాగా కర్నూలు సిటీ ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు. ఆయనపై కబ్జా ఆరోపణలు చేశారు. దీంతో ఎమ్మెల్యే హఫీజ్..లోకేష్ పాదయాత్రని అడ్డుకోవాలని చూశారు. పోలీసులు పరిస్తితిని చక్కదిద్దారు.

అయితే ఇలా ఆరోపణలు చేయడం..ఎమ్మెల్యేల ఏమో అడ్డుకోవాలని చూడటం జరుగుతుంది. ఇక ఎమ్మెల్యేలు అలా చేయకపోతే ఇంకా వారికే డ్యామేజ్ అవుతుంది. అందుకే ఎమ్మెల్యేలు ఏదో రకంగా లోకేష్ పాదయాత్రని అడ్డుకోవాలని చూస్తున్నారు. అసలే జగన్ సీట్లు ఉండవని అంటున్నారు..ఈ క్రమంలో కాస్త హడావిడి చేస్తే సీట్లు దక్కుతాయనే ఆలోచనలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది.

Share post:

Latest