పిచ్చి ప్రేమ‌తో ఆ హీరో కోసం సాయి ప‌ల్ల‌వి అలాంటి ప‌ని చేసిందా?

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. నేటితరం హీరోయిన్లు గ్లామర్ పుంతలు తొక్కుతుంటే.. సాయి పల్లవి మాత్రం కేవలం నటనకే ప్ర‌ధాన్య‌త ఇస్తూ కెరీర్ ను స‌క్సెస్ ఫుల్‌గా సాగిస్తోంది. స్కిన్ షోకు దూరంగా ఉంటూ.. నటన‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో ప్రేక్షకులకు చేరువైంది. స్టార్ హోదాను అందుకుంది.

ఇకపోతే నేడు సాయి పల్లవి పుట్టినరోజు. దీంతో అభిమానులు, సినీ తారలు ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. అలాగే పుట్టిన‌రోజు సందర్భంగా సాయి పల్లవికి సంబంధించి కొన్ని ఆసక్తిక‌ర‌ విషయాలు తెరపైకి వస్తున్నాయి. ల‌క్ష‌లాది అభిమానులకు ఫేవరెట్ హీరోయిన్ అయిన సాయి పల్లవి.. ఓ హీరోకు వీరాభిమాని.

ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు కమల్ హాసన్. అవును, కమల్ హాసన్ అంటే సాయి పల్లవికి పిచ్చి ప్రేమ అట‌. ఆయనకు వీరాభిమాని అట. ఈ విష‌యాన్ని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో సాయి ప‌ల్ల‌వి స్వ‌యంగా తెలిపింది. క‌మల్ హాస‌న్ అంటే చాలా ఇష్ట‌మ‌ని.. ఎంతా అంటే ఏకంగా ఆయన నటించిన సినిమా కు సంబంధించిన పోస్టర్స్ కట్ చేసి తన దగ్గర దాచుకున్నానని, ఇప్పటికీ ఆ పోస్టర్స్ అన్నీ తన దగ్గరే ఉన్నాయని తెలిపింది సాయి పల్లవి. ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తోంది. ఇందులో శివ కార్తికేయన్‌ హీరోగా న‌టిస్తున్నాడు. ఇటీవ‌లె ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో చెన్నైలో ప్రారంభం అయింది.

Share post:

Latest