మధ్యకాలంలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా బలగం. ఈ సినిమాని తెలంగాణ యాస లో తెరకెక్కించారు.బాక్స్ ఆఫీస్ వద్ద మంచిఈ సక్సెస్ సాధించిన ఈ చిత్రానికి దర్శకుడు వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు వేణులో ఇంత మంచి దర్శకుడు ఉన్నాడా అనిపించేలా చేశారు. ఈ సినిమాతో దిల్ రాజు వేణు మీద పెట్టుకున్న నమ్మకం నిజంగా నిజమయిందనే చెప్ప వచ్చు..
బలగం సినిమా తరువాత ఏకంగా నట నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమాను తీసి తన టాలెంట్ నిరూపించుకోవాలనుకుంటున్నాడట వేణు.మాస్ కమర్షియల్ అంశాలతో పాటుగా బలగం సినిమాలనే ఒక సున్నితమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.వేణు ఆల్రెడీ బలగం సినిమాతో హిట్ అందుకున్నాడు కాబట్టి బాలయ్యను కలిసి కథ చెప్పగానే ఆయన కూడా సరే అన్నాడట..
ఈ సినిమాను కూడా దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ సినిమా తరువాత వేణు తోనే సినిమా ఉంటుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ జూన్ 10న రిలీజ్ చేసే అవకాశం ఉంది . ఎందుకంటే ఆరోజు బాలయ్య బర్తడే సందర్భంగా తన చేయబోయే నెక్స్ట్ సినిమాల గురించి చెప్పబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
వేణు జబర్దస్త్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ గా సినిమాలను చేస్తూ అగ్ర హీరోలతో సినిమాలు చేయటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎది ఏదమైనా వేణుకి బాలయ్య తో సినిమా చేయటానికి ఛాన్స్ దొరికిందంటే ఇక ఆయన రేంజ్ వేరే లెవల్ కి వెళ్లిందని చెప్పవచ్చు.. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.