ప్రియాంక చోప్రా నిజంగా సినిమాలకు టాటా చెప్పనుందా?

బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ప్రియాంక. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా మారింది. ‘లవ్ ఎగైన్’ అనే ఒక హాలీవుడ్ మూవీతో ఇటీవల ప్రేక్షకులను అలరించిన ప్రియాంకా ప్రస్తుతం ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ అనే ఒక ఇంగ్లీష్ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.

ఇక అసలు విషయానికొస్తే, ప్రియాంక చోప్రా కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అవును, మీరు విన్నది నిజమే. ప్రియాంక చోప్రా సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట. కూతురి కోసం ప్రియాంక ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా వయసు 40 ఏళ్లు. ఈ వయసులో సినిమాలు చేయడం కంటే ఉన్న ఒక్కగానొక్క కూతురు ‘మాలతి మేరీ చోప్రా జోనస్’ను చూసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడానికి ఆసక్తిని కనబరుస్తోందని వినికిడి.

కూతురు వయసు పెరిగే కొద్ది తల్లి అవసరం ఉంటుందని, అందుకే ఆమె త్వరలో సినిమాలకు గుడ్‌ బై చెప్పి తన సమయాన్ని మొత్తం తన కూతురుకే కేటాయించాలని అనుకుంటోందట. ఈ విషయమై ఆమె ఒక మీడియాతో మాట్లాడుతూ.. నా కూతురు కోసం సినిమాలు మానుకోవాల్సి వస్తే నేను రెండో ఆలోచన లేకుండా సినిమాలు మానేస్తాను అని చెప్పుకొచ్చింది. వేరే దేశంలో స్థిరపడతాను అని ఆమె చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈమె అమెరికన్ పాప్ సింగర్ అయిన నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Share post:

Latest