బీజేపీకి బాబు-పవన్ ట్విస్ట్.. అప్పుడే తేలుస్తారా?

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరు రెండు సార్లు భేటీ కావడంతో పొత్తుపై క్లారిటీ వస్తుంది. అయితే ఈ ఇద్దరు నేతలు కలవడంపై వైసీపీ  విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తోడేళ్లు గుంపు మాదిరిగా వస్తున్నారని జగన్ తో సహ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎవరు కలిసొచ్చిన తమ వైపే ప్రజలు ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ లోలోపల మాత్రం బాబు-పవన్ పొత్తు విషయంలో వైసీపీ టెన్షన్ గానే ఉంది.

ఇక టెన్షన్ మరింత పెంచేలా ఇటీవల మరొకసారి బాబు-పవన్ భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. భవిష్యత్ ప్రణాళికపై కూడా మాట్లాడుకున్నట్లు తెలిసింది. బాబు-పవన్ భేటీ బట్టి చూస్తే..టి‌డి‌పి-జనసేన పొత్తు దాదాపు ఖాయమనే చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే వీరితో బి‌జే‌పి కలుస్తుందా  లేదా అనేది చర్చ. నిజానికి జనసేనతో బి‌జే‌పి కలిసే ఉంది. కానీ టి‌డి‌పితో కలవడానికి బి‌జే‌పి రెడీగా లేదు. టి‌డి‌పితో కలవమని చెప్పేస్తున్నారు.

ఇటు టి‌డి‌పి శ్రేణులు సైతం బి‌జే‌పితో పొత్తు ఇష్టపడటం లేదు. కానీ చంద్రబాబు, పవన్ మాత్రం..కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల..బి‌జే‌పితో కలిస్తే ప్రయోజనం ఉంటుందనే కోణంలో ఇద్దరు నేతలు ఉన్నారు. కేంద్రం సపోర్ట్ ఉండటం వల్ల కాస్త బెనిఫిట్ ఉంటుందని ఆలోచన చేస్తున్నారు.

కానీ కేంద్రం పరోక్షంగా జగన్‌కు సహకారం అందిస్తున్నారనే ప్రచారం ఉంది. దీని బట్టి చూస్తే బి‌జే‌పి..టి‌డి‌పి-జనసేనతో కలిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు బట్టి బి‌జే‌పితో కలిసి ముందుకెళ్లాలా లేదా అనేది బాబు-పవన్ ఆలోచించుకుంటారని తెలుస్తోంది. మరి చూడాలి ఎవరు ఎవరితో పొత్తు ఉంటుందో.

Share post:

Latest