ఎన్టీఆర్30లో మరో క్రేజీ అందాల భామ.. యంగ్ టైగర్‌కు డబుల్ ధమాకా నా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నీ తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్‌కు ప్రతి నాయకుడుగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ ప్రతి ఒక్కరిని ఎంతో ఎగ్జైట్ చేస్తూనే ఉంది. చాలా టైం తీసుకుని మరి కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసి కొన్ని వారాల కిందటే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు.

NTR 30: Janhvi Kapoor's new Tollywood movie will launch soon; all details  about the movie - TechnoSports Media Group

ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా ఎంతో డిఫరెంట్ గా కనిపించబోతున్నారని కూడా తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించబోతుందని తెలుస్తుంది. ఇక మరి ఆ హీరోయిన్ మరి ఎవరో కాదు లేడీ ప‌పర్ స్టార్ సాయి పల్లవి ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా నటించే అవకాశం ఉందని తాజాగా ఓ టాక్ వినిపిస్తుంది. నిజానికి గతంలో కూడా సాయి పల్లవి- ఎన్టీఆర్ సినిమాలో నటిస్తోంది అంటూ పలు వార్తలు వచ్చాయి.

Big Surprise! Sai Pallavi Is #NTR30 Heroine?

మళ్ళీ తాజాగా ఇప్పుడు అదే వార్త వినిపిస్తుంది మరి ఈ వార్తలో ఎంతవరకు నిజము ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. రీసెంట్ గానే మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఓ షెడ్యూల్ ముగించుకుని రెండో షెడ్యూల్ కూడా ప్రారంభించబోతున్నారు కొరటాల. మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల భారీగానే కాసురత్తులు చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్- కొరటాలు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

Share post:

Latest