గొప్ప మ‌న‌సు చాటుకున్న సంయుక్త మీనన్‌.. ఏం చేసిందో తెలిస్తే శ‌భాష్ అంటారు!

టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని త‌క్కువ స‌మ‌యంలోనే గోల్డెన్ లెగ్ అనిపించుకున్న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సంయుక్త మీన‌న్.. రీసెంట్ గా `విరూపాక్ష‌` మూవీతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. దీంతో సంయుక్త‌కు టాలీవుడ్ లో ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే ఇటీవ‌ల `విరూపాక్ష‌` డైరెక్ట‌ర్ కార్తీక్ వ‌ర్మ దండు కు ఐఫోన్ గిఫ్ట్ గా ఇచ్చిన సంయుక్త మీన‌న్.. తాజాగా మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకుంది. విరూపాక్ష ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇటీవ‌ల హీరో సాయి ధరమ్‌ తేజ్‌, సోనియా సింగ్‌, రవికృష్ణతో క‌లిసి ఓ టీవీ రియాల్టీ షోకు వెళ్లింది. ఈ షోలో సంయుక్త మీన‌న్ స్కూటీ గెల్చుకుంది.

 

అయితే, ప్రోగ్రామ్‌లో గెల్చుకున్న స్కూటీని అక్కడకు వచ్చిన కాలేజీ అమ్మాయిల్లో ఎవరో ఒకరికి ఇస్తానని సంయుక్త తెలిపింది. ఈక్రమంలోనే సింగిల్‌ పేరెంట్‌ ఉన్న ఇద్దరు అమ్మాయిలను ఎంచుకున్న సంయుక్త‌.. అందులో ఒకరికి తాను గెల్చుకున్న సూటీని గిఫ్ట్‌గా ఇచ్చింది. అంతేకాదు, మ‌రొక అమ్మాయికి తానే స్వ‌యంగా స్మూటీని కొని గిఫ్ట్ గా ఇస్తాన‌ని మాటిచ్చింది. దాంతో ఆ ఇద్ద‌రు అమ్మాయిల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇక ఈ విష‌యం తెలుసుకున్న నెటిజ‌న్లు శ‌భాష్ అంటూ సంయుక్త‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Share post:

Latest