మరొక అరుదైన మైల్ స్టోన్ అందుకున్న రష్మిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఛలో సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రష్మిక.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు వెలుగుబడ్డాయి. విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈమె క్రేజ్ డబుల్ అయిందని చెప్పవచ్చు. మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ, అల్లు అర్జున్తో పుష్ప, సీతారామం చిత్రంలో కీలకమైన పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.

Rashmika Mandanna Reaches 38 Million Followers On Instagram, Deets Inside -  Sakshi
దీంతో నేషనల్ క్రైస్ట్ గా పేరుపొందిన రష్మిక సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక అటు టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతోంది.. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించిన రష్మిక యావత్ సినీ ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసే విధంగా పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం రష్మిక పుష్ప-2 చిత్రంతోపాటు రెయిన్బో అనే సినిమాలో కూడా నటిస్తోంది.

ఇదంతా ఇలా ఉంటే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఉండే రష్మిక ఇంస్టాగ్రామ్ లో సరికొత్త మైలురాయిను అందుకుంది. తన అకౌంట్లో మొత్తం 38 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకొని సరికొత్త రికార్డును సైతం సృష్టించింది. దీంతో తెలుగులో అత్యధికంగా ఇంస్టాగ్రామ్ లో అత్యధికంగా ఫ్యాన్ పాలయం కలిగిన హీరోయిన్గా రష్మిక ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest