సుధీర్గ కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సత్తా చాటుతున్న ముద్దుగుమ్మల్లో శ్రియా ఒకటి. వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే శ్రియా పెళ్లి చేసుకుంది. లాక్‌డౌన్ సమయంలో ఓ బిడ్డకు తల్లి అయింది. కానీ, పెళ్లి జరిగింది.. ఓ బిడ్డకు శ్రియా తల్లి అంటే అస్సలు నమ్మరు. అంతలా ఈ ముద్దుగుమ్ము తన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తోంది.
నాలుగు పదుల వయసులోనూ హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది. యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది అయితే తాజాగా శ్రియా ఓ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంట్రాక్ట్ యంది. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ `పెళ్లయ్యాక కూడా మీరు ఇంత అందంగా ఉండటానికి కారణం ఏంటి..? `అని ప్రశ్నించాడు. అందుకు శ్రియా ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
హీరోయిన్స్ ని మాత్రమే ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు? హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా? అంటూ ఎదురు ప్రశ్నించి శ్రియా సదరు జర్నలిస్ట్ కి దిమ్మతిరిగే షాకిచ్చింది. పెళ్ళై పిల్లలను కన్నాక కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని నా ఫ్రెండ్స్ తరచూ పొగొడుతుంటారు. అయితే ఇక్కడ అందం ఒక్కటే ముఖ్యం కాదు. వయసు? పరిశ్రమకు వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? వంటి విషయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అయినా ఇదే ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా..? వాళ్ళను అడిగిన రోజున నేను సమాధానం చెబుతాను.` అంటూ శ్రియా చెప్పుకొచ్చింది.