గుడివాడలో కొడాలి నానికి ఎదురులేకుండా పోయిన విషయం తెలిసిందే. గత నాలుగు ఎన్నికల నుంచి ఆయనదే హవా. 2004, 2009 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన ఆయన..2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా గెలిచి సత్తా చాటాలని కొడాలి స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే అక్కడ మరింత పట్టు సాదించే దిశగా కొడాలి ముందుకెళుతున్నారు.
అయితే ఈ సారి కొడాలికి చెక్ పెట్టి సత్తా చాటాలని టీడీపీ చూస్తుంది. ఇక టిడిపి నుంచి బలమైన అభ్యర్ధిని బరిలో దింపాలని చూస్తుంది. టిడిపిలో రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి సీటు వస్తుందో క్లారిటీ లేదు. కార్యకర్తలు రావికే సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అటు రాము ఆర్ధికంగా బలంగా ఉండటంతో ఆయనకే సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. పైగా ఆయన భార్య ఎస్సీ సామాజికవర్గం కావడంతో, ఇటు రాము కమ్మ వర్గం కావడంతో..గెలుపు సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
ఈ క్రమంలో రాము సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే టిడిపి నుంచి ఎవరు బరిలో దిగిన గెలిచి తీరాలని కొడాలి చూస్తున్నారు. కాకపోతే ఇంతకాలం అధికారంలో లేకపోవడం వల్ల సరిగా పనులు చేయలేకపోయారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా పెద్దగా గుడివాడకు చేసిందేమి లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. ఇదే సమయంలో గుడివాడలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
గుడివాడలో కొత్త బస్టాండ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సిఎం జగన్ చేతుల మీదుగా శంఖుస్థాపన కార్యక్రమం జరగనుంది. మరి దీని నిర్మాణ ఎప్పటికీ పూర్తి అవుతుందో క్లారిటీ లేదు. ప్రస్తుతం శంఖుస్థాపన చేసి అభివృద్ధి చేస్తున్నామని ప్రజలు చూపించే పని చేస్తున్నారు. దీంతో గుడివాడలో తనకు తిరుగుండదని, ఐదోసారి కొడాలి గెలుపు ఖాయమని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. మరి చూడాలి కొడాలికి ఐదో గెలుపు వస్తుందో లేదో.