శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బాలీవుడ్ లో ఇప్పటికి ఎన్నో చిత్రాలలో నటించి బాగానే క్రేజ్ సంపాదించింది. ఈ మధ్యనే ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరోయిన్గా టాలీవుడ్ తరపు పరిచయం కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరొక సినిమాకు కూడా ఓకే చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి అక్కినేని యువ హీరో అఖిలతో జాన్వీ రొమాన్స్ చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అఖిల్ ఏజెంట్ సినిమా భారీ అంచనాలు మధ్య పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల కాగా ఫ్లాప్ గా మిగిలిపోయింది.. అఖిల్ తర్వాత చిత్రాన్ని డైరెక్టర్ సుజిత్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనిల్ కుమార్ తో చేయబోతున్నట్లు సమాచారం. అఖిల్ ఆరవ చిత్రాన్ని UV క్రియేషన్ బ్యానర్ వారు నిర్మించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ చేయబోతున్నారని టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతోనే కాకుండా అఖిల్ వంటి యంగ్ హీరోలతో కూడా ఈమె జతకట్టబోతోంది అంటే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి కూడా ఏఎన్నార్ ,నాగార్జునతో సినిమాలు చేయడం జరిగింది ఇప్పుడు మళ్లీ అక్కినేని మనవడుతో శ్రీదేవి కూతురు కాంబినేషన్ అదిరిపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. విషయం మరి ఇందులో జాన్వీ కపూర్ నిజంగా నటిస్తోందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఏ మేరకు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమో చూడాలి మరి.