సూపర్ స్టార్ రజనీకాంత్..దక్షిణ భారతదేశంలో ఆయన పేరు తెలియని వారు ఉండదు..కేవలం దక్షిణ భారతదేశంలోనే కాదు..ఉత్తరాన కూడా రజనీకి ఉన్న క్రేజ్ వేరు. ఇక తమిళనాడు ప్రజలైతే ఆయన్ని ఓ దైవం మాదిరిగా కొలుస్తారు. అలాంటి రజనీకాంత్ ఇప్పుడు వైసీపీ నేతల చేతుల్లో చిక్కుకున్నారు. ఇటీవల ఆయన ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం, చంద్రబాబుతో ఉన్న స్నేహం కారణంతో ఏప్రిల్ 28న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.
ఇక ఆయన ఎన్టీఆర్ గురించి చెబుతూనే..చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. తనకు ఉన్న పరిచయం కొద్ది ఆయన..బాబు గురించి చెప్పారు. మళ్ళీ చంద్రబాబు గెలవాలని కోరుకున్నారు. అయితే ఆయన జగన్ పై గాని, వైసీపీ ఊసు తీయలేదు. ఒక్క మాట అనలేదు. కానీ ఆయన..చంద్రబాబుని పొగడటమే పెద్ద తప్పు అయిపోయింది. యథావిధిగా కొడాలి నాని, లక్ష్మీపార్వతి, దేవినేని అవినాష్, జోగి రమేష్ లాంటి వారు ప్రెస్ మీట్లు పెట్టి రజనీకాంత్ పై విమర్శలు చేశారు. కొడాలి నాని చెప్పాల్సిన పని లేదు. యథావిధిగా తన నోటికి పనిచెప్పారు. రజనీకాంత్ ఓ సన్యాసి అని విరుచుకుపడ్డారు.
అయితే ఇలా వైసీపీ వాళ్ళు..రజనీకాంత్‌ని తిట్టడాన్ని ఏపీ ప్రజలు హర్శించడం లేదనే చెప్పాలి. ఎలాగో ఏపీలో ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. అయినా..రజనీకాంత్ వైసీపీని ఏం అనలేదు..అయినా సరే అలా తిట్టడం ఏంటని..ఇది సరైన పద్ధతి కాదని ప్రజలు భావించే పరిస్తితి. వైసీపీ నేతలు ఎంతటి వారినైనా తిట్టడానికి వెనుకాడటం లేదు. అలా తిట్టడమే ఆ పార్టీకి పెద్ద మైనస్ అవుతుందని..ఆ విషయం అర్ధం చేసుకోవడం లేదని అంటున్నారు.
ఇక చంద్రబాబు సైతం వైసీపీపై ఫైర్ అయ్యారు..అసలు రజనీకాంత్ వైసీపీని గాని, జగన్‌ని గాని ఏం అనలేదని..అయినా వైసీపీ వాళ్ళు నోటికి పని చెప్పడంపై ఫైర్ అయ్యారు. తక్షణమే రజనీకాంత్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు తమిళనాడులో రజనీ ఫ్యాన్స్..సైతం వైసీపీ నేతలు టార్గెట్ గా సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. మొత్తానికి రజనీని తిట్టి వైసీపీనే బ్యాడ్ అయినట్లు ఉంది.