దుబాయ్ లో ల‌గ్జ‌రీ విల్లా కొన్న మ‌హేష్ బాబు.. ఖ‌రీదు ఎంతంటే?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. నిర్మాత‌గా స‌త్తా చాటుతున్నాడు. అలాగే అనేక టాప్‌ బ్రాండ్స్ కు ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌హ‌రిస్తూ యాడ్స్ లో న‌టిస్తున్నారు. మ‌రోవైపు వ్యాపార‌వేత్త‌గా దూసుకుపోతున్నారు. ఇప్పటికే రెస్టారెంట్, మల్టీప్లెక్స్ వ్యాపార‌ల్లోకి అడుగు పెట్టి.. కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయం సొంతం చేసుకుంటున్నారు.

ఇలా సంపాదించిన డబ్బులను మహేష్ బాబు తెలివిగా ఇన్వెస్ట్ చెస్తున్నారు. ముఖ్యంగా ప్రాపర్టీస్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. ఆల్రెడీ మ‌హేష్ బాబు పేరిట ప‌లు న‌గ‌రాల్లో ల‌గ్జ‌రీ విల్లాలు ఉన్నాయి. తాజాగా మ‌రో ల‌గ్జ‌రీ విల్లాను కొనుగోలు చేశారు. అది కూడా ఇక్క‌డ కాదు.. దుబాయ్‌లో.

దుబాయిలో అత్యంత ఖరీదైన మ‌రియు విలాస‌వంత‌మైన ఒక విల్లాను మ‌హేష్ బాబు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీని ఖ‌రీదు కొన్ని కోట్ల‌లో ఉంటుంద‌ని అంటున్నారు. కొడుకు గౌతమ్ కృష్ణతో కలిసి మహేష్ బాబు తాజాగా దుబాయ్ వెళ్లారు. అయితే కొత్త విల్లా రిజిస్ట్రేషన్ పనుల కోసం మహేష్ త‌న‌యుడితో దుబాయ్ కు వెళ్లారని స‌మాచారం.

Share post:

Latest