చిరుకే చెమటలు పట్టిస్తున్న కీర్తి సురేష్…భోళా శంకర్‌కు ఇంత కష్టం వచ్చిందేంటి..!

వాల్తేరు వీరయ్య లాంటి బంపర్ హిట్‌ తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా భోళా శంకర్ రీమేక్ సినిమా అయినా చక చక షూటింగ్ మాత్రం ముందుకు వెళ్ళటం లేదు. ఈ సినిమాకు విడుదల తేదీ ముందుగానే ప్రకటించిన..కావాల్సినంత సమయం ఉన్నా ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా..? అనే అనుమానాలు వస్తున్నాయి. ఆగస్టు 11 అంటే ఇంకా మూడు నాలుగు నెలలు పైగానే సమయం ఉంది.

RakhiWithBholaaShankar | MegaStar Chiranjeevi, Keerthy Suresh | Meher  Ramesh | Anil Sunkara - YouTube

ఈ సినిమా షూటింగు సంబంధించి వర్క్ కూడా అదే రేంజ్ లో ఉందనే టాక్ వినిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించి 40 రోజులకు పైగా వర్క్ ఉందని తెలుస్తుంది. అయితే ఇక్కడ చిరంజీవి వైపు నుంచి ఎలాంటి లోపం లేకపోయినా.. ఈ సినిమాలో నటిస్తున్న ఇతర నటీనటులైన కీర్తి సురేష్ నుంచి సమస్య వస్తుందని తెలుస్తుంది.

Keerthy Suresh To Play Chiranjeevi's Sister In Telugu Movie 'Bhola Shankar'  - Sacnilk

ఈ సినిమా షూటింగ్లో చిరంజీవి పాల్గొన్నట్టు స్పీడ్ గా కీర్తి సురేష్ పాల్గొనడం లేదట. దీంతో ఈ సినిమా షూటింగ్ కి వరుస బ్రేకులు పడుతున్నట్టు తెలుస్తుంది. ఇక దీంతో ఈ సినిమా విడుదల తేదీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Share post:

Latest