అశ్విని దత్ కు గట్టి కౌంటర్ వేసిన పోసాని..!!

టాలీవుడ్ లో నటుడు పోసాని కృష్ణ మురళి ఈ మధ్యకాలంలో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి అధికార పార్టీ వైసీపీకి సపోర్టుగా ఉంటున్నారు. అలాగే వైసిపి ప్రభుత్వం హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమధ్య నంది అవార్డులకు కుల అవార్డులతో పోసాని పోల్చడం జరిగింది.. తాజాగా అశ్వని దత్ నంది అవార్డుల గురించి మాట్లాడుతూ ఉత్తమ రౌడీ ఉత్తమ గుండా అవార్డులు ఇస్తారంటూ పలు సంచలన విమర్శలు చేయడం జరిగింది..

సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్లకు మోసగాడు సినిమా రి రిలీజ్ అనౌన్స్మెంట్ చేసిన వెంటనే అశ్వినీ దత్ నంది అవార్డుల పైన కామెంట్లు చేయడం జరిగింది. అయితే అవేవి అధికార పార్టీని ఉద్దేశించి ప్రచారం చేశారని వార్తలు తెరపైకి రావడంతో ఈ నేపథ్యంలో తాజాగా పోసాని కృష్ణ మురళి అశ్వనీ దత్ వ్యాఖ్యల పైన రియాక్ట్ అయ్యి పలు విమర్శలు చేయడం జరిగింది. నంది అవార్డులన్నీ ఇస్తే మీరు ఉత్తమ వెన్నుపోటుదారుడు ఉత్తమ లోఫర్ ఉత్తమ మోసగాడు అవి కదా ఇవ్వాలి అలాగే మీ వాళ్లకు ఉత్తమ వెధవలు ఉత్తమ సన్నాసులు అని ఇస్తే ఇంకా బాగుంటుంది అంటూ ప్రతి విమర్శలు చేయడం జరిగింది.

అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ గారి పైన కూడా పోసాని గాటుగా విమర్శలు చేశారు.. చెన్నై నుంచి విజయవాడకు వచ్చి చంద్రబాబును పొగుడుతుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అది అతని ఇష్టం తెలుగు వాళ్లకి రజనీకాంత్ ఏమి సూపర్ స్టార్ కాదు మాకు చిరంజీవి ఉన్నారు చిరంజీవికి జగన్ అంటే చాలా ఇష్టం అలాగే జగన్ చిరంజీవికి అన్న అంటూ వైఎస్ఆర్సిపికి ఇచ్చినంత గౌరవం ఇస్తారు అంటూ తెలిపారు. రజనీకాంత్ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదంటూ పోసాని తెలిపారు.

Share post:

Latest