మామూలుగా సెలబ్రెటీలు ఏ పని చేసిన ఓ వింత లాగా ఉంటుంది. వారు అది కావాలని చేస్తారో వారి సరదా కోసం చేస్తారో తెలియదు కానీ వారు చేసే ఆ పనులు చూస్తుంటే సామాన్య ప్రజలకి కూడా వారు సెలబ్రిటీ లేనా అనే అనుమానం వస్తుంది. ఇక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే కూడా ఎన్నోసార్లు సోషల్ మీడియాలో ఇలాంటి పనులు చేసి వైరల్ గా మారింది.
ఇప్పుడు మరోసారి పూజా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్టును షేర్ చేసింది. ఆ పోస్టులో పూజా ఆటోలో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం పూజా వెకేషన్‌కు శ్రీలంకకు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆమె అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు చూడడం కోసం ఎటువంటి ఏసీ కారు బుక్ చేసుకోకుండా కేవలం ఒక చిన్న ఆటోలో ప్రయాణిస్తూ కనిపించింది.
ఇక అందులో పూజ క్యూట్ గా నవ్వుతూ కనిపించింది. ఆ ఫోటో చూసిన నెటిజెన్లు ఆమె ఆటోలో వెళ్ళటం చూసి ఎంతో మురిసిపోతున్నారు. ప్రస్తుతం పూజా సినిమాల విషయానికి వస్తే త్రివిక్రమ్- మహేష్ కాంబోలో వస్తున్నSSMB28లో నటిస్తుంది అంతేకాకుండా పవన్- హరి శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పూజా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం పూజ హెగ్డే షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram