ప్ర‌భాస్ చాలా బాధ‌పెట్టాడు.. అత‌డి వ‌ల్ల నా సినిమా పోయిందంటున్న ఐశ్వ‌ర్య రాజేష్‌!

టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వ‌ర్య రాజేష్ తాజాగా `ఫర్హానా` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. నెల్సన్ వెంకటేశన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మే 12న త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో విడుద‌ల కాగా.. తొలి ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ల‌భించింది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఐశ్వ‌ర్య రాజేష్‌.. ప్ర‌భాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

ప్ర‌భాస్ త‌న‌ను చాలా బాధ‌పెట్టాడ‌ని.. అత‌డి వ‌ల్ల నా సినిమా పోయింద‌ని వ్యాఖ్యానించింది. `నా కెరీర్ లో ఎప్ప‌టికీ గుర్తుండిపోయే చిత్రాల్లో కౌశల్య కృష్ణమూర్తి ఒక‌టి. ఈ సినిమా కోసం ఫిజికల్ గా ఎంతో శ్రమించాను. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

కానీ ఆ నెక్స్ట్ వీక్ ప్రభాస్ సాహో రిలీజ్ కావడంతో మా చిత్రానికి పెద్ద షాక్ త‌గిలింది. టాక్ బాగున్నా ప్రేక్ష‌కుల మా సినిమాను ప‌ట్టించుకోలేదు. అంద‌రూ ప్ర‌భాస్ మూవీ వైపే మొగ్గు చూపారు. కౌసల్య కృష్ణమూర్తి చిత్రానికి క్రమంగా ఆడియన్స్ పెరుగుతున్న టైమ్‌లో ఇలా జ‌రిగింది. ఫ‌లితంగా మా సినిమా ఇక్క‌డ ఫ్లాప్ అయింది. దాంతో చాలా బాధ‌ప‌డ్డాను` అంటూ ఐశ్వ‌ర్య రాజేష్ చెప్పుకొచ్చింది. అయితే థియేట‌ర్స్ లో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొంద‌లేక‌పోయినా కౌసల్య కృష్ణమూర్తి.. బుల్లితెర‌పై మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకుంది. ఏదేమైనా ప్ర‌భాస్ సాహో రాక‌పోయినా.. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం మంచి విజ‌యం సాధించేది అన‌డంలో సందేహం లేదు.

Share post:

Latest