సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. అక్కడ సక్సెస్ అవ్వాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఇక హీరోయిన్ అవ్వాలంటే కేవలం అందం ఉంటే సరిపోదు అదృష్టం కూడా కావాలి. అంతే కాకుండా అందం అభినయం..అదృష్టం ఇవి మూడూ ఉండి కూడా ఇండస్ట్రీలో రాణించలేకపోయిన హీరోయిన్ లు ఉన్నారు. దానికి కారణం ఆ హీరోయిన్లు చేసిన చిన్న చిన్న తప్పులే. ఇంతకీ ఆ హీరోయిన్ లు ఎవరు వాళ్లు చేసిన తప్పులేంటి అనేది ఇప్పుడు చూద్దాం.
మెగావారసుడు రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా చిరుత. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ నేహాశర్మ కూడా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. కానీ తరవాత మాత్రం పత్తా లేకుండా పోయింది. దానికి కారణం చిరుత లాంటి బ్లాక్ బస్టర్ తరవాత వరుణ్ సందేకు జోడీగా కుర్రాడు సినిమాలో నటించడమే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఇండస్ట్రీకే దూరం అయ్యింది.
నువ్వునేను సినిమాలో ఉదయ్ కిరణ్ కు జోడీగా నటించిన ముద్దుగుమ్మ అనిత. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. కానీ ఆ తరవాత అనిత స్క్రీప్ట్ సెలక్షన్ సరిగ్గా లేక వరుస ఫ్లాప్ లు పడటంతో చివరికి ఇండస్ట్రీకే దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత ముంబై వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడ సెటిల్ అయిపోయింది.
నాగచైతన్య జోష్ సినిమాతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమై బ్యూటీ కార్తీక. జోష్ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. ఈ సినిమా తరవాత కోలీవుడ్ లో రంగం సినిమాలో నటించగా ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక తరవాత మళ్లీ తెలుగులో దమ్ము సినిమాలో నటించగా ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో తెలుగులో అవకాలు లేకుండా పోయాయి.
రవితేజ హీరోగా నటించిన ఇడియట్ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రక్షితకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తరవాత రక్షిత ఆంద్రావాలా, నిజం సినిమాలలో నటించింది. కానీ ఈ సినిమాలు ఆడకపోవడంతో ఆ తరవాత ఆఫర్లు లేకుండా పోయింది.
ఇక అర్జున్ రెడ్డి బ్యూటీది కూడా అదే పరిస్థితి. అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన హీరోయిన్ షాలిని పాండే. ఈ సినిమా తరవాత షాలిని 118 సినిమాలో నటించింది. ఈ చిత్రం అనుకున్నమేర విజయం సాధించలేదు. ఇక షాలిని రెచ్చిపోయి అందాలు చూపిస్తున్నా ఆఫర్ లు మాత్రం రావడం లేదు.