అనుష్క కెరీర్ నాశనం చేసేందుకు ఆ దర్శకుడు పెద్ద ప్లాన్, ట్వీట్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్‌ను హీరోయిన్లు, ఇతర నటీమణులు ఒక్కొక్కరు బయట పెడుతూ సంచలనాలకు తెర తీస్తున్నారు. డ్రగ్స్, నెపొటిజం, మర్డర్స్‌, కాస్టింగ్ కౌచ్, ఒకరినొకరు తొక్కేయడం వంటి ఎన్నో చీకటి కోణాలు హిందీ సినిమా పరిశ్రమలో ఉన్నట్లు నటీమణులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు ముఖ్యంగా కొందరిపైనే వినిపిస్తున్నాయి. అలాంటి వారిలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్‌ ఒకరని చెప్పవచ్చు.

బాలీవుడ్‌లో ఎన్నో హిట్లతో ఒక రాజు లాగా కొనసాగిన కరణ్ జోహర్ ఇప్పుడు మాత్రం ఒక విలన్ అయిపోయాడు. అంతేకాదు ఇతను కేవలం నెపోటిజాన్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తాడనే ముద్ర పడిపోయింది. కొత్తవారిని, తన మాట వినని వారిని తొక్కేయడం ఈ నిర్మాతకి వెన్నతో పెట్టిన విద్య అని ఇప్పుడిప్పుడే కొందరి యాక్టర్స్ నుంచి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను కూడా తొక్కేయడానికి ఈ నిర్మాత ట్రై చేశాడనే వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి.

 

సుశాంత్‌తో హీరోగా చేసిన ఒక సినిమాను థియేటర్‌లో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేసేలా కుట్ర చేశాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక కరణ్ జోహర్ తీరుపై కంగనా రనౌత్ ఎప్పుడూ మండిపడుతూనే ఉంటుంది. తన కెరీర్ లైఫ్ కూడా అతను పాడు చేయడానికి ట్రై చేశాడని కంగనా అప్పుడప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. అయితే తాజాగా కరణ్ జోహర్‌పై ఒక బాలీవుడ్ క్రిటిక్ సంచలన ఆరోపణలు చేశాడు.

క్రిటిక్ ఉమేర్ సంధూ ఒక ట్వీట్ చేస్తూ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మను తొక్కేయడానికి కరణ్ ప్రయత్నించాడని చెప్పాడు. అయితే అనుష్క భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీ 2017లో కరణ్‌కి చెంపపెట్టు లాంటి సవాల్ విసిరాడట. “అనుష్క శర్మ కెరీర్‌ను నాశనం చేయడం నీ అయ్యతరం కూడా కాదు” అంటూ కరణ్ జోహర్‌కు కోహ్లీ చాలెంజ్ కూడా విసిరాడని ఉమేర్ సంధూ ఒక ట్వీట్‌లో చెప్పుకొచ్చాడు. ఇందులో ఉన్న నిజమెంత అనేది తెలియదు కానీ ఈ ట్వీట్ మాత్రం బాలీవుడ్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారి తీసింది.