దిల్ రాజు అంటే తెలియని వారుండరు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. `దిల్` మూవీతో నిర్మాతగా మారాడు. తొలి సినిమా టైటిల్ నే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఆర్య, భద్ర, బొమ్మరిల్లు ఇలా వరుస విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ టాలీవుడ్ లోనే స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందారు.
ఇండస్ట్రీలో దిల్‌రాజు జడ్జిమెంట్‌కు తిరుగులేదని అంటుంటారు. ఈ ఏడాదిని `వారసుడు` వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఘనంగా ప్రారంభించారు. ప్రస్తుతం రామ్ చరణ్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న `గేమ్ ఛేంజర్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.
ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ వల్ల భారీగా నష్టపోయానని వెల్లడించారు. అయితే ప్రత్యక్ష్యంగా ఆ హీరోలు కారణం కాకపోయినా వారి సినిమాల వల్ల డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకు గట్టి దెబ్బ పడింది. అవును, మహేష్ నటించిన స్పైడర్, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రాలను దిల్‌రాజు భారీ మొత్తానికి కొనుగోలు చేసి నైజాంలో రిలీజ్ చేశాడు. అయితే ఈ రెండు సినిమాలు డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. దాంతో స్పైడర్ వల్ల రూ. 12 కోట్లు, అజ్ఞాతవాసి వల్ల రూ. 13 కోట్లు నష్టపోయాడట. మొత్తానికి ఈ రెండు చిత్రాల వల్ల దిల్ రాజుకు పాపం పాతిక కోట్లు నష్టం వాటిల్లింది.