ఎన్టీఆర్‌కు భారీ షాక్.. ఎన్టీఆర్ 30 నుంచి ఆ స్టార్ హీరో అవుట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తరవాత సంవత్సరం పాటు గ్యాప్ తీసుకుని మరి కొరటాల శివాతో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. కొరటాల, చిరంజీవి- రామ్ చరణ్ తో కలిసి చేసిన ఆచార్య సినిమా ఘోరమైన డిజాస్టర్ రావటంతో ఆ మూవీతో కొరటాల క్రేజ్ మొత్తం డామేజ్ అయింది. ఆ సినిమాతో వచ్చిన నెగటివ్ టాక్ నుంచి కోలుకోవడానికే ఐదారు నెలల సమయం పట్టింది.

దీంతో ఎన్టీఆర్ తో చేయాలనుకున్న సినిమా కథలో ఎన్నో మార్పులు కూడా వచ్చాయి. మార్పులు చేయడానికి కొరటాలకు ఏకంగా 7- 8నెల సమయం పట్టింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

NTR 30: Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on NTR 30

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఢీకొట్టే విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం సైఫ్ ఈ సినిమా ఆఫర్ ను తిరస్కరించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో నటించడానికి నిర్మాతలు భారీ మొత్తంలోనే ఆఫర్ చేసినా.. ఈ సినిమా చేయలేనని సున్నితంగా బాలీవుడ్ హీరో తిరస్కరించినట్టు టాలీవుడ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం.

Saif Ali Khan team reacted to NTR30 rumors | cinejosh.com

దీంతో పాన్ ఇండియా మూవీ కావడంతో మరో బాలీవుడ్ స్టార్‌హీరో తో కొరటాల చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక‌ ఈ సినిమాను ఏప్రిల్ 5, 2024న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.