“రష్మిక కి అలాంటి మగాడే మొగుడు గా కావాలట”.. క్వాలిటీస్ తెలిస్తే మతులు పోవాల్సిందే..!!

రష్మిక మందన .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ ఛలో సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది . కిరాక్ పార్టీ అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా తనదైన స్టైల్ లో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్గా రాజ్యం ఏలేసింది . కాగా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న రష్మిక .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయింది . ప్రజెంట్ రష్మిక పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తుంది అంటే ఏ రేంజ్ లో అమ్మడు హవా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఈ రోజు రష్మిక మందన పుట్టినరోజు. గ్రాండ్గా ఫ్యామిలీతో, తన ఫ్రెండ్స్ తో బర్త డే ను సెలబ్రేట్ చేసుకుంటున్నా రష్మిక మందనకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ క్రమంలోని రష్మిక గతంలో తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన వీడియోని ట్రెండ్ చేస్తున్నారు రష్మిక అభిమానులు . ఈ క్రమంలోనే రష్మిక మాట్లాడుతూ..” తనకు ఎలాంటి హస్బెండ్ కావాలో క్లియర్ గా చెప్పింది . ఎవరి దగ్గర మనం రక్షణగా ఉంటామో.. కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటామో.. మన భావాలను ఓపెన్గా పంచుకుంటామో ..అతడు మన పక్కన ఉంటే హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటామో.. అలాంటి వాడే తనకు భర్తగా రావాలి అని రష్మిక గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది . ప్రజెంట్ ఇదే వ్యాఖ్యలను రష్మిక అభిమానులను ట్రెండ్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే రష్మిక కి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతారు అంటూ టాలీవుడ్ లో ఉన్న కొందరికి జత చేసి మరి ఆమె ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు. కాగా రష్మిక మందన విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉంది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . కాగా రీసెంట్గా ఆ ప్లేస్ ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీప్లేస్ చేశాడు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . ఈ మధ్యకాలంలో రష్మిక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో వీళ్ళ మధ్య లవ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . చూడాలి మరి దీనిపై రష్మిక మందన ఏ విధంగా స్పందిస్తుందో..?