యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు వీరి కాంబోలో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాపై కూడా టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్‌కు ప్రతి నాయకుడుగా ఈ సినిమాలో నటిస్తున్నాడు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రతి అప్డేట్ ప్రతి ఒక్కరిని ఎంతో ఎగ్జైట్ చేస్తూనే ఉంది. చాలా టైమ్ తీసుకుని మరి కొరటాల ఈ సినిమా స్క్రిప్ట్ ని పూర్తి చేసి కొన్ని వారాల కిందటే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కూడా సరికొత్త అవతారంలోకి మారటం కూడా అభిమానులను ఎంతో ఎగ్జైట్ చేస్తుంది.
రీసెంట్ గా మొదలైన ఈ సినిమా తొలి షెడ్యూల్లోనే ఈ సినిమాలోని ఎంతో కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలుస్తుంది. అందులోనే ఒక భారీ యాక్షన్ సన్నివేశం కూడా ఉందట. అది కూడా కుస్తీ పోటీ నేపథ్యంలో కొనసాగుతుందని తెలుస్తుంది. ఈ ఫైట్ ఇండస్ట్రీలోనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్‌ను కుస్తీయోధుడిగా చూపించడం అంటే ప్రేక్షకులకు గూస్ బం తెప్పించినట్లే. ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు తెలుగులో ఏ స్టార్ హీరో చేయలేదనే చెప్పాలి. ఈ సినిమాల్లో ఒక కీలక సందర్భంలో ఈ ఫైట్ వస్తుందట.
ఈ ఫైట్ కోసం ఎందరో జూనియర్ ఆర్టిస్టులు కూడా షూటింగ్లో పాల్గొన్నారు అని తెలుస్తుంది. ఈ సినిమాలోని ముఖ్యమైన ఘట్టంలో ఒకటిగా ఈ ఫైట్ ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్ పూర్తిగా ఈ సినిమాకే అంకితమై ఉండడంతో గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ చేయాలని సినిమా యూనిట్ భావిస్తుందట. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు రానున్న విషయం మనకు తెలిసిందే. ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.