యాడ్స్ లో న‌టించ‌డానికి స‌మంత పుచ్చుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

సుదీర్ఘకాలం నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న సమంత.. ఇటీవల కెరీర్ పరంగా మరింత దూకుడు చూపిస్తుంది. ఓవైపు వరుస పాన్ ఇండియా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తుంది. రీసెంట్ కూడా పెప్సీ యాడ్ లో దుమ్ము దులిపేసింది.

అయితే ఒక్కో సినిమాకు ఆరు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే సమంత‌.. కమర్షియల్ యాడ్స్‌కు ఏ స్థాయిలో ఛార్జ్ చేస్తుందో తెలిస్తే నోరెళ్ల‌బెడతారు. ఇంతకుముందు ఒక్కో యాడ్ కు స‌మంత‌ రెండు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ పుచ్చుకునేది. కానీ ఇప్పుడు ఆమె ఒక పాన్ ఇండియా స్టార్‌. అంత‌కుముందు సౌత్‌కే ప‌రిమిత‌మైన స‌మంత‌.. ‘ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వెబ్ సిరీస్ ద్వారా నార్త్ లోనూ భారీ ఇమేజ్ ను సంపాదించుకుంది.

ఈ నేపథ్యంలోనే స‌మంత ఒక్కో యాడ్ కు ఇప్పుడు రూ. 3 కోట్ల రేంజ్ లో పారితోషికం పుచ్చుకుంటుందట. ఈ విషయం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా యాడ్ షూట్ అంటే రెండు మూడు రోజుల్లో అయిపోతుంది. ఆ మూడు రోజులకే మూడు కోట్లు పుచ్చుకుంటుంది అంటే సమంత క్రేజ్, బ్రాండ్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Share post:

Latest