అభిమానులకు భారీ షాక్ ఇచ్చిన అలియా-రణబీర్.. పెళ్ళైన ఏడాదికే ఇలాంటి నిర్ణయమా..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అలియాభట్ ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అఫ్కోర్స్ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారి ఆ తర్వాత స్టార్ స్టేటస్ ను అందుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ ఓ వైపు అమ్మ అన్న ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు స్టార్ హీరోయిన్ ముందుకు దూసుకెళ్తుంది . మనకు తెలిసిందే అలియాభట్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ అని ప్రేమించి పెళ్లి చేసుకుంది .

కొంతకాలం డేటింగ్ చేసిన ఈ జంట ఆ తర్వాత పెద్దలను ఒప్పించి గ్రాండ్గా తమ ఇంట్లోనే అంగరంగ వైభవంగా తమ పెళ్లిని జరుపుకున్నారు. ఆ తర్వాత పెళ్లయిన రెండు నెలలకే మూడో నెల అంటూ అభిమానులకి డబుల్ గుడ్ న్యూస్ అందించిన అలియా భట్ ..రీసెంట్ గానే పండు లాంటి పాపకు జన్మనిచ్చింది. అయితే పెళ్లి తర్వాత యమ ఫాస్ట్ గా మారిపోయింది అలియా భట్ .ఈ క్రమంలోనే ఆలియా తన బాడీని మళ్లీ షేపులోకి తీసుకొచ్చి ..క్రేజీ ఆఫర్స్ ని పట్టేస్తుంది .

అయితే ఓ పక్క బేబీని చూసుకుంటూ మరో పక్క సినిమాలు చేయడం అలియాకు మనసు కష్టంగా ఉందట . ఈ క్రమంలోని కమిట్ అయిన సినిమాలను షూట్ కంప్లీట్ అయిన తర్వాత సుదీర్ఘంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని ఆలోచిస్తుందట. అంతేకాదు రణబీర్ సైతం ఇదే విధంగా ఫిక్స్ అయ్యాడు అని తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం రణబీర్ ఆలియా అభిమానులకు ఇది బాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పటివరకు వాళ్ళు కమిట్ అయిన సినిమాలు రెండో మూడో ఈ మూడు సినిమాలు కంప్లీట్ అయిపోతే మాత్రం రణబీర్-అలియా ని తెరపై చూడాలి అంటే కొంతకాలం ఆగాల్సిందే. పెళ్లయిన ఏడాదికే ఈ జంట ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అభిమానులు షాక్ అవుతున్నారు . చూద్దాం దీనిపై ఏ విధంగా స్పందిస్తారో ఈ జంట..?