వనిత విజయ్ కుమార్ మాజీ భర్త మృతి.. హాట్ టాపిక్‌గా మారిన న‌టి పోస్ట్‌!

వివాదాల‌కు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్రెస్ అయిన వ‌నిత విజ‌య్ కుమార్ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. వ‌నిత మూడో మాజీ భర్త పీటర్ పాల్ మృతి చెందారు. గత కొంత‌ కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పీట‌ర్‌.. చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ క‌న్నుమూశాడు.

పీట‌ర్ తో విడిపోయినప్పటికీ వ‌నిత విజ‌య్ కుమార్.. ఆయ‌న‌ మరణవార్త తెలిసి ఎమోషనల్ అయ్యారు. ఈ మేర‌కు వ‌నిత విజ‌య్ కుమార్ పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. `ఇతరులకు సహాయం చేసిన వారికి దేవుడు సహాయం చేస్తాడని మా అమ్మ చెప్పింది. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నిజం. నీ మరణం నన్ను ఎంతగానో బాధించింది.

నీ ఆత్మకు శాంతి చేకూరాలని, ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను` అంటూ పోస్ట్ పెట్టింది. దాంతో ఆమె పోస్ట్ కాస్త వైర‌ల్ గా మారింది. కాగా, వ‌నిత మొద‌ట ఆకాష్ అనే వ్య‌క్తిని 2000లో పెళ్లి చేసుకుని.. 2007లో విడిపోయింది. అదే ఏడాది ఆనంద్ జయరాజన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. 2012లో అతనితో విడిపోయారు. ఇక ముచ్చ‌ట‌గా మూడోసారి పీటర్ పాల్ ని చేసుకోగా.. అత‌డితో కూడా ఎక్కువ కాలం ఉండ‌లేకపోయింది. ప్ర‌స్తుతం పిల్ల‌ల‌తో వ‌నిత ఒంట‌రి జీవితాన్ని గ‌డుపుతోంది. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌మిళంలో ప‌లు సినిమాలు చేస్తోంది.

https://www.instagram.com/p/CrnnHJhSabS/?utm_source=ig_web_copy_link

Share post:

Latest