బ్యాడ్ లక్ అన్న‌వారి బెండు తీసిన నిధి.. ఒక్కొక్క‌రికీ ఇచ్చిప‌డేసింది!

ఆక‌ట్టుకునే అందం, మంచి టాలెంట్ ఉన్నా స‌రే నిధి అగ‌ర్వాల్ కెరీర్ మాత్రం ఊపందుకోవ‌డం లేదు. `ఇస్మార్ట్ శంకర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అనంత‌రం నిధి ద‌శ తిరిగిపోతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. ప్ర‌స్తుత ఈ భామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు జోడీగా `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`లో న‌టిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కి మూడేళ్లు అవుతున్నా.. వ‌రుస బ్రేకుల కార‌ణంగా షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకోవ‌డం లేదు.

ఈ మూవీ మిన‌హా నిధి చేతిలో మ‌రో ప్రాజెక్ట్ లేదు. దీంతో కొంద‌రు నెటిజ‌న్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. బ్యాడ్ లక్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్‌ బ్యూటీగానే పేరు తెచ్చుకుంది.. నటన పరంగా మెప్పించలేదు.. అందుకే ఆఫ‌ర్లు రావ‌డం లేదంటూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ కామెంట్స్ పై తాజాగా నిధి స్పందించింది.

బ్యాడ్ లక్ బ్యూటీ అన్న‌వారి బెండు తీసింది. ఒక్కొక్క‌రికీ త‌న‌దైన శైలిలో ఇచ్చిప‌డేసింది. నటన విషయంలో తానే కాదు పూర్తిగా తెలిసిన వారు ఎవరూ లేర‌ని, నటన గురించి అందరికీ అన్ని విషయాలు తెలియవు అని, అందులో తాను కూడా ఉన్నాని తెలిపింది. తాను ఇప్పటి వరకు సినిమాల్లో గ్లామరస్‌గా కనిపించే విషయంపైనే ఫోకస్‌ పెట్టానని.. కానీ, ఇక పై పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే చేస్తాన‌ని పేర్కొంది. అలాగే ట్రోల్స్ ను తాను ఎప్పుడూ ప‌ట్టించుకోన‌ని.. ప‌ని పాట లేకుండా ఖాళీగా ఉన్న‌వారే చెత్త కామెంట్స్ చేస్తార‌ని నిధి కౌంట‌ర్ వేసింది. దీంతో ఈమె వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి.

Share post:

Latest