ఆయన మీద కోపంతోనే అలా చేసా.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న రాజమౌళి కామెంట్స్..!!

దర్శక ధీరుడు రాజమౌళి పేరు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిందే. ఆయన రీసెంట్ గా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.. ప్రజెంట్ ఆస్కార్ అవార్డు అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది . మరి ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పుడు హాలీవుడ్ స్థాయిలో ఆర్ఆర్ఆర్ పేరు పాపులారిటీ సంపాదించుకోవడానికి కారణం రాజమౌళి అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాగా ఇదే క్రమంలో గతంలో ఎస్ ఎస్ రాజమౌళి మెగాస్టార్ చిరంజీవి పై చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.

రాజమౌళి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ గా నిలిచింది మగధీర . ఈ సినిమాలో హీరోగా నటించింది మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ . ఇండస్ట్రీలోకి వచ్చిన సెకండ్ సినిమాతోనే ఇంత పెద్ద భారీ విజయవంతమైన హిట్ ని ఆయన ఖాతాలో వేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది . 2009 జూలై 31వ తేదీన చాలా గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రాజమౌళి కెరియర్ లోనే ప్రత్యేకంగా నిలిచింది .

ఈ సినిమాలో చరణ్ ఇసుక ఊబిలో కూరుకుపోయినప్పుడు ..ఓ గుర్రం సహాయంతో బయటకు వస్తాడు. ఆ తర్వాత ఆ గుర్రంతో చాలా ప్రేమగా మెలుగుతాడు. అయితే ఈ సీన్ అప్పట్లో చాలా చర్చనీయాంశంగా మారింది . అయితే దానిపై వివరణ ఇస్తూ రాజమౌళి చేసిన కామెంట్స్ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. రాజమౌళి అప్పట్లో మాట్లాడుతూ..”మెగాస్టార్ చిరంజీవికి నేను పెద్ద వీరాభిమాని అని.. ఆ టైంలోనే కొదమ సింహం సినిమాను ఎన్నోసార్లు చూశానని..

అయితే రౌడీలు చిరంజీవిని ఇసుకలో పాతిపెట్టి వెళ్ళిపోగా.. అప్పుడు చిరంజీవికి గుర్రం సహాయం చేస్తుందని .. ఆ తర్వాత చిరంజీవి ..తన ప్రాణాన్ని కాపాడిన గుర్రానికి మధ్య అనుబంధం సీన్స్ మూవీ లో లేకపోవడం హర్ట్ అయ్యారట. ఈ క్రమంలోనే డిసప్పాయింట్ అయిన రాజమౌళి ..చరణ్ సినిమాలో అలా గుర్రానికి ప్రాధాన్యత ఇచ్చి సీన్ తెరకెక్కించారు అంటూ చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే అప్పట్లో రాజమౌళి చేసిన కామెంట్స్ మెగా అభిమానులను హర్ట్ చేశాయి . మరోసారి ఇదే వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్లు..!!

 

Share post:

Latest