ఎన్టీఆర్ ని తోక్కేస్తున్న చరణ్.. అమెరికాలో తారక్ కి మరో ఘోర అవమానం..!?

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. రణం రౌద్రం రుధిరం అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది . ఎప్పుడు లేని విధంగా తెలుగు సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్కు నామినేట్ అయ్యి ఫైనల్ లిస్టులో కనిపించింది. అంతేకాదు కచ్చితంగా ఆస్కార్ అవార్డన అందుకోబోతుంది అంటూ తెలుగు జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆర్ఆర్ఆర్ టీంకు ఫ్రీ ఆస్కార్ పార్టీ ఇచ్చింది .

ఈ పార్టీకి దక్షిణాసియా ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్ ,ఉపాసన ప్రీతిజింతా , జాక్వ్లిన్ ,సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు . అయితే ఈ పార్టీలో అందరూ చరణ్ ని హైలైట్ చేస్తూ మాట్లాడారని ..ఎన్టీఆర్ పేరు ఎక్కడ ప్రస్తావించలేదని కేవలం ఎన్టీఆర్ తో పిక్స్ మాత్రమే దిగి క్రేజ్ మొత్తం చరణ్ కి ఇచ్చాడన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

మరి ముఖ్యంగా ప్రియాంక చోప్రా కూడా చరణ్ చేయి పట్టుకొని ఎక్కడ ఒక్క నిమిషం కూడా వదలలేదని ..ఎన్టీఆర్ ని మాత్రం హాయ్ అంటూ పలకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయిందని ..ఆ తర్వాత ఆయనకు మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

దీంతో నందమూరి అభిమానులు ప్రియాంక చోప్రాపై గుర్రుగా ఉన్నారు . ప్రియాంక అక్కడ సినిమాలో నటిస్తూ హాలీవుడ్ స్టార్ పాపులారిటీ సంగా పాదించుకుంది . రీసెంట్ గానే హాలీవుడ్ వెబ్ సిరిస్ సిటాడెల్ లో కూడా నటించింది ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఆమె ఇచ్చిన ప్రీ ఆస్కార్ పార్టీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది..!!

 

Share post:

Latest