Dasara First Day Collections : నాని కెరియర్ లోనే ఇది ఓ సంచలనం.. ఆ రికార్డులు తుక్కు తుక్కు చేసేసాడుగా..!!

నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా దసరా. నిన్న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవల్ లో ధియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో సుమారుగా 900 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిస్తుంది. కాగా ఇంతటి క్రేజీ టాక్ సంపాదించుకున్న దసరా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారో అంతకు డబల్ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసాడు నాని . రీసెంట్గా నాని దసరా సినిమాకి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ రిలీజ్ అయ్యాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు దసరా సినిమా సాధించిన కలెక్షన్స్ చూస్తే ఏపీ తెలంగాణ మొత్తంగా 14 . 22 కోట్లుగా తెలుస్తుంది.

అటు ఓవర్సీస్ లోను ప్రీమియర్ షో లతోనే దిమ్మతిరిగే వసూలు రాబట్టింది నాని దసరా సినిమా. ఫస్ట్ రోజే ఎనిమిది లక్షల 50 వేల డాలర్ను వసూలు చేసి నాని కెరియర్ లోనే సంచలన రికార్డ్ నెలకొల్పింది. తెలంగాణా నేపధ్యంలో వచ్చిన ఈ చిత్రం నైజాం ఏరియాలో లిటరల్ గా కుమ్మేసిందని చెప్పాలి. 3.5 కోట్లు ఈ సినిమా నైజాం ఏరియాలో వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇది నాని గత చిత్రం కన్నా 50% ఎక్కువ.

అంతేకాదు దసరా ఏరియా వైస్ కలెక్షన్లు చూస్తే ఈ విధంగా ఉన్నాయి .

ద‌స‌రా ఏరియా వైజ్ ఫ‌స్ట్ డే వ‌సూళ్లు ఇలా ఉన్నాయి…
నైజాం – 6.78 కోట్లు
సీడెడ్ – 2.36 కోట్లు
ఉత్త‌రాంధ్ర – 1.42 కోట్లు
ఈస్ట్ – 90 ల‌క్ష‌లు
వెస్ట్ – 55 ల‌క్ష‌లు
గుంటూరు – 1.22 కోట్లు
కృష్ణా – 64 ల‌క్ష‌లు
నెల్లూరు – 35 ల‌క్ష‌లు
——————————————–
ఏపీ + తెలంగాణ = 14.22 కోట్లు (షేర్ )
——————————————–
ఏపీ, తెలంగాణ గ్రాస్ = 24.85 కోట్లు

ఓవరాల్ గా నాని దసరా సినిమా టాక్ పరంగానే కాదు,, కలెక్షన్లు పరంగా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా బాక్సాఫీస్ వద్ద సంచన రికార్డు నెలకొల్పింది. ప్రతీచోటా సెన్సేషనల్ ఓపినింగ్స్ వచ్చాయి…!!